Asianet News TeluguAsianet News Telugu

బింబిసారకి సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్, డైరెక్టర్ ఎవరంటే

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే బింబిసార అనే చెప్పాలి. వశిష్ఠ  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. జానపదం తరహా జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటన కనబరిచారు.

Nandamuri Kalyan ram announces Bimbisara Prequel dtr
Author
First Published Jul 5, 2024, 2:39 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే బింబిసార అనే చెప్పాలి. వశిష్ఠ  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. జానపదం తరహా జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటన కనబరిచారు. బింబిసార చక్రవర్తిగా నెగిటివ్ షేడ్స్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. 

ఈ చిత్ర క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుంది అన్నట్లుగా హింట్ ఇచ్చారు. రిలీజ్ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా బింబిసార 2 తప్పకుండా ఉంటుందని తెలిపారు. నేడు కళ్యాణ్ రామ్ తన 46వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బింబిసార నుంచి అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే చిన్న ట్విస్ట్.. కళ్యాణ్ రామ్ ప్రకటించింది బింబిసారకి సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ ప్రకటించారు. 

బింబిసార చిత్రంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని చూపించారు. త్రిగర్తలని బింబిసారుడి కంటే కొన్ని తరాల ముందు అద్భుతంగా పరిపాలించిన మహారాజు కథని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అయితే ఆయన పేరు కూడా బింబిసార అనే ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చిత్ర యూనిట్ టైటిల్ ప్రకటించలేదు. ఎన్ కె ఆర్ 22 అని పోస్టర్ వేసి.. బింబిసారుడికి ముందు పరిపాలించిన చక్రవర్తి కథ అని అనౌన్స్ చేశారు. 

 

మరి ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి. బింబిసార చిత్రాన్ని తెరకెక్కించిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు కాదు. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. యుద్ధరంగంలో భారీ ఏనుగులు చూపిస్తూ త్రిగర్తల వైభవాన్ని పోస్టర్ లో చూపించారు. 

బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్‌ బింబిసారగా కనిపించారు. ప్రీక్వెల్‌లో అంతకు మించిన అద్భుతమైన కథను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్టు విషయంలో ప్రతి స్టేజ్‌లోనూ ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను ఆస్వాదిస్తోంది యూనిట్‌. బింబిసార2కి ప్రాణం పోయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ మీద ఇప్పటిదాకా ఎవరూ చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

'రొమాంటిక్‌' సినిమాను తెరకెక్కించిన అనిల్‌ పాదూరి బింబిసార2కి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.  అత్యంత భారీ స్థాయిలో, అత్యంత ఉన్నతమైన సాంకేతిక పనితనంతో కనువిందు చేసే దృశ్యకావ్యంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది బింబిసార2. అతి త్వరలో సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios