టాలీవుడ్ లో చాలా కాలం తరువాత మెగా - నందమూరి వార్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రోజుకో కామెంట్ తో నాగబాబు బాలకృష్ణపై రివెంజ్ తీర్చుకుంటుండడంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అలాగే అభిమానుల మధ్య కూడా వాతావరణం వేడెక్కిందనే చెప్పాలి. రీసెంట్ గా నందమూరి అభిమానులు చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో మరింతగా వైరల్ అవుతున్నాయి. 

ఓ అభిమాని ఎన్టీఆర్ కథానాయకుడు చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని అద్భుతంగా చూపించారని అదే విధంగా ఎన్టీఆర్ - ఏఎన్నార్ ల మధ్య స్నేహం ఎంత బావుండేదో ఒకసారి నాగబాబు గారు చుస్తే మంచిది అని కామెంట్ చేశాడు. అంతే కాకుండా నాగబాబు కావాలని సినిమా చూడకుండా బాలకృష్ణపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు మాట్లాడారు. 

అవకాశాలు లేక ఏం చేయాలో తెలియక బాలకృష్ణపై ఈ విధమైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ తీవ్ర ఆగ్రహంతో సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా అభిమానులు ఈ కామెంట్స్ పై తారా స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు నందమూరి అభిమానులు అందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు.