Asianet News TeluguAsianet News Telugu

'భగవంత్‌ కేసరి’ ట్రైలర్ లో దాచిన ఎలిమెంట్ ఇదే, థియేటర్ లో పేలుతుంది

ఇప్పటికే  రిలీజైన ట్రైలర్ లో అదిరిపోయే ఓ ఎలిమెంట్ కావాలనే  దాచి పెట్టారని, థియేటర్ లో అది పేలేలా ప్లాన్ చేసారని తెలుస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ట్రైలర్ లో ఆ విషయం రివీల్ చేసే అవకాసం ఉండచ్చు అంటున్నారు. 

Nandamuri Balakrishna to play double role  in Bhagawant Kesari ? JSP
Author
First Published Oct 11, 2023, 7:47 AM IST | Last Updated Oct 11, 2023, 7:47 AM IST

 ట్రైలర్ రిలీజైన నాటి నుంచి సినిమా ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు భగవంత్ కేసరి.   అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కు ఒక్క సారిగా బజ్ రెట్టింపు అయ్ియంది. దసరాకు విడుదల కానున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమా గా చెప్పబడుతున్న ఈ సినిమా లో  శ్రీలీల  ప్రధాన పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.

ఇక  2 నిమిషాల 51 సెకన్ల పాటు సాగిన ట్రైలర్ లో  తన కూతురిని ఆర్మీకి పంపాలి అనే ఆశయం కలిగిన తండ్రిగా బాలకృష్ణ, ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేని కూతురిగా శ్రీలీల కనిపిస్తుంది. తర్వాత యాక్షన్ సన్నివేశాలు వరుసగా వచ్చాయి. అసలు విలన్ కి బాలకృష్ణ, శ్రీలీలకి సంబందం ఏంటి అనే సస్పెన్స్ మెయిన్టైన్ చేస్తూ ట్రైలర్ సాగింది. అయితే ట్రైలర్ లో ఓ విషయం దాచి పెట్టారని, థియేటర్ లో అది పేలేలా ప్లాన్ చేసారని తెలుస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ట్రైలర్ లో ఆ విషయం రివీల్ చేసే అవకాసం ఉండచ్చు అంటున్నారు. ఇంతకీ ఏమిటా విషయం అంటే...

Nandamuri Balakrishna to play double role  in Bhagawant Kesari ? JSP

ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ రెండో గెటప్ ఉండబోతోందని అంటున్నారు. ఆ పాత్ర పోలీస్ ఆఫీసర్..చాలా రోజుల తర్వాత రౌడీ ఇన్సపెక్టర్ స్దాయి పాత్రలో బాలయ్య మళ్లీ కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఈ పాత్రకు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఆ పాత్రకు గెటప్ పోలీస్ గా ఉన్నా, డైలాగులు హోరెత్తి పోతాయని, సినిమాలో ఊహించని ట్విస్ట్ ఆ పాత్ర ఇస్తుందని వినికిడి. 

    ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి  వైరల్ అవ్వుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్. అర్జున్‌ రాంపాల్‌, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’అన్న మాట నిజం కాబోతోందని అభిమానులు ఆనందంగా ఉన్నారు. 
 
 ట్రైలర్‌లో నందమూరి బాలకృష్ణను కొత్త అవతార్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో బాలయ్య చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఆయన రొటీన్ డైలాగ్ డెలివరీకి భిన్నంగా ఉండటం కొత్తగా అనిపిస్తుంది. కానీ బాలయ్య మార్కు యాక్షన్ సన్నివేశాలు మాత్రం మిస్ కానివ్వలేదు. థమన్ (SS Thaman) అందించిన రీ-రికార్డింగ్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లిందనేది నిజం. ఈ సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్ర కూడా గిరిజనులలో ఒకరిగా ఉంటుందని సమాచారం. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సినిమాలో ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios