నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. జైసింహా చిత్రం తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. 

కమర్షియల్ చిత్రాలతో దర్శకుడు కెఎస్ రవికుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. బాలయ్యని ఈ చిత్రంలో సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర సెట్స్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రంలో బాలయ్య లుక్ కంప్లీట్ గా మారిపోయింది. 

బాలయ్య అభిమానులకు సైతం ఈ లుక్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్టైలిష్ గా కనిపించే ఫ్రెంచ్ కట్ గడ్డం లుక్ లో బాలయ్య చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ లుక్ లో బాలయ్య వయసు 20 ఏళ్ళు తగ్గిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీలు వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.