నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైజాగ్ నుంచి భరత్ ఎంపిగా టిడిపి తరుపున పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా భరత్ ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలని పంచుకున్నారు. టిడిపికి జూ.ఎన్టీఆర్ అవసరం లేదు అని భరత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

దీనితో పాటు చిత్ర పరిశ్రమలో బాలయ్య, చిరంజీవి మధ్య పోటీ గురించి కూడదా భరత్ కామెంట్ చేశాడు. చిరంజీవి, బాలయ్యలని పోల్చి చూడలేం. ఎందుకంటే చిరంజీవి గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కానీ బాలయ్య ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి గారు ఒకే తరహా పాత్రలు చేసినట్లు నాకెప్పుడూ అనిపించలేదు. ప్రతి రెండు చిత్రాల్లో ఆయన వేరియేషన్ మారేది. 

కానీ బాలయ్యని దర్శకులు, రచయితలు ఒక మూసలో ఇరికించారు. ఫ్యాక్షన్ చిత్రాల ఇమేజ్ పెరగడం వల్ల మామయ్య విషయంలో రచయితలు మరో కోణంలో ఆలోచించలేదు. కానీ ఇటీవల బాలయ్య అన్ని రకాల పాత్రలు చేస్తున్నట్లు భరత్ తెలిపాడు. 

తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున చిత్రాలు చూస్తూ పెరిగానని భరత్ పేర్కొన్నారు. ఇప్పటి జనరేషన్ హీరోలలో రాంచరణ్, రానా దగ్గుబాటి లాంటి హీరోలు కొత్తగా ఆలోచిస్తున్నట్లు భరత్ పేర్కొన్నాడు.