విశ్వక్ సేన్ చివరగా ఓరి దేవుడా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. త్వరలో విశ్వక్ సేన్ మరో మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం 'ధమ్కీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం కోసం విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియో ఎంతటి వివాదంగా నిలిచిందో చూశాం. ఇటీవల సీనియర్ హీరో అర్జున్ సినిమా విషయంలో కూడా విశ్వక్ సేన్ వార్తల్లో కెక్కాడు. 

విశ్వక్ సేన్ చివరగా ఓరి దేవుడా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. త్వరలో విశ్వక్ సేన్ మరో మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం 'ధమ్కీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నేడు జరిగింది. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలయ్య రచ్చ రచ్చ చేశారు. విశ్వక్ సేన్ గురించి ఫన్నీగా మాట్లాడుతూ అలరించారు. ధమ్కీ చిత్రంలోని డైలాగ్ ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. 

ధమ్కీ.. నీ ఇంట్లో నా ఇంజన్ అని బాలయ్య డైలాగ్ చెప్పడంతో అక్కడ అభిమానులు కేరింతలు, ఈలలతో కేక పెట్టించారు. విశ్వక్ సేన్ కి సినిమాలు అంటే పిచ్చి అని.. అందుకే అతడంటే నాకు ఇష్టం అని బాలయ్య అన్నారు. 

విశ్వక్ సేన్ కూడా బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల విశ్వక్ సేన్ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 2లో అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.