Asianet News TeluguAsianet News Telugu

మంచి జోరుమీదున్న టైంలో ఈ ప్రయోగం అవసరమా.. షాకిస్తున్న బాలయ్య కొత్త మూవీ డీటెయిల్స్

నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. అఖండ చిత్రంతో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు.

Nandamuri Balakrishna new movie details are shocking
Author
First Published Dec 9, 2022, 11:27 AM IST

నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. అఖండ చిత్రంతో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సాలిడ్ బజ్ క్యారీ అవుతోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. బాలయ్య జోరు చూస్తుంటే నందమూరి ఫ్యాన్స్ భలే ఖుషీగా ఉన్నారు. పదేళ్ల క్రితం బాలయ్య చేసిన సినిమాలని గమనిస్తే.. ఇక బాలకృష్ణ కెరీర్ పుంజుకోవడం సాధ్యమేనా అని ప్రతి ఒక్కరూ సందేహం వ్యక్తం చేశారు. 

కానీ అనూహ్యంగా బాలయ్య కెరీర్ లో జోష్ వచ్చింది. దీనికి తోడు అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ మరింతగా పెరిగింది. ఇలాంటి తరుణంలో బాలయ్య గురించి ఫ్యాన్స్ ని కలవరపాటుకి గురిచేసే న్యూస్ వైరల్ గా మారింది. 

బాలకృష్ణ ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక గురువుగా భావించే శ్రీ రామానుజాచార్యులు జీవిత కథలో బాలకృష్ణ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నారట. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ వెచ్చించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ రామానుజాచార్యుల పాత్ర పోషించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. 

అయితే ఫ్యాన్స్ మాత్రం కలవరపడుతున్నారు. కెరీర్ మంచి జోరు మీద ఉన్న తరుణంలో ఒక ఆధ్యాత్మిక చిత్రం అవసరమా అంటున్నారు. బాలయ్యని ఫ్యాన్స్ హీరోగా మాత్రమే చూసేందుకు ఇష్టపడతారు. అందుకే ఒక వేళ బాలయ్య ఈ చిత్రం చేసే రిస్క్ తో కూడిన ప్రయోగం అనే చెప్పాలి. ఈ చిత్రానికి చినజీయర్ స్వామి అండదండలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ చిత్ర అనౌన్స్మెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios