'డాకు మహారాజ్' ట్రైలర్ రివ్యూ: కింగ్ ఆఫ్ జంగిల్, ఎలివేషన్స్ అదిరాయి, అదొక్కటే నిరాశ
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అంతా ఊహించినట్లుగానే ట్రైలర్ యాక్షన్ బ్లాస్ట్ అన్నట్లుగా అదిరిపోయింది. రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలు కాకుండా డార్క్ థీమ్ లో ట్రైలర్ సాగుతోంది. ఎడారి, జంగిల్ బ్యాక్ డ్రాప్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. జనవరి 12న డాకు థియేటర్స్ లోకి దిగుతున్నాడు. బాలకృష్ణ యాక్షన్ మూవీ చేస్తే మాస్ ఆడియన్స్ కి పండగే. డైరెక్టర్ బాబీ మాస్ యాక్షన్ చిత్రాలతో తనకంటే ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత బాలయ్యతో డాకు మహారాజ్ తెరకెక్కిస్తున్నారు. దీనితో ఈ చిత్రం పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
డాకు మహారాజ్ చిత్రంపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అంతా ఊహించినట్లుగానే ట్రైలర్ యాక్షన్ బ్లాస్ట్ అన్నట్లుగా అదిరిపోయింది. రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలు కాకుండా డార్క్ థీమ్ లో ట్రైలర్ సాగుతోంది. ఎడారి, జంగిల్ బ్యాక్ డ్రాప్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.
అనగనగా ఒక రాజు ఉండేవాడు అంటూ బాలయ్య పాత్రని పరిచయం చేసే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ రాజుని చెడ్డవాళ్లంతా డాకు అనేవారు... మాకు మాత్రం మహారాజు. కౌన్ హై రే తు అనే డైలాగ్ వినిపించగానే బాలయ్య పేరు పడుతుంది.. వెంటనే బాలయ్య కనిపిస్తారు. డైరెక్టర్ బాబీ ట్రైలర్ కట్ చాలా బావుంది. చిన్న పాపతో సన్నివేశాలు బావున్నాయి. ప్రజలని బానిసల్లాగా భావించి హింసించే విలన్ గ్యాంగ్ పరిచయం అవుతుంది. అడవిలో జంవుతుల స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా.. ఏ ఎలుగుబంటో పులో వస్తే అంటూ శ్రద్దా శ్రీనాథ్ భయపడుతూ ఉంటుంది. కానీ చిన్న పాప మాత్రం.. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉండమ్మా అంటూ అదిరిపోయే ఎలివేషన్ ఇస్తుంది. యాక్షన్ సీన్స్ ని బాబీ కొత్తగా తెరకెక్కించినట్లు ఉన్నారు. ప్రగ్యా జైస్వాల్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్ చివర్లో అసలు ఎవడ్రా నువ్వు అని మరోసారి విలన్లు అడుగుతారు.. దీనితో బాలయ్య ఇచ్చే సమాధానం.. ఆ తర్వాత వచ్చే బిజియం హైలైట్. ఎవడ్రా నువ్వు అని అడగగానే మైకేల్ జాక్సన్ అని బాలయ్య చెబుతారు. వెంటనే బ్యాగ్రౌండ్ లో మైకేల్ జాక్సన్ డేంజరస్ సాంగ్ ప్లే అవుతుంది. మొత్తంగా డాకు మహారాజ్ చిత్రం బాలయ్య చేసే రెగ్యులర్ మాస్ యాక్షన్ చిత్రాపైకి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్ లో ఒకే ఒక్క నిరాశ కలిగించే అంశం ఉంది. బాలయ్య స్టైల్ లో లౌడ్ డైలాగ్స్ ఎక్కడా లేవు. బాలయ్య అంటే విలన్లకు వార్నింగ్ ఇచ్చే భారీ డైలాగ్స్ ని ఫ్యాన్స్ ఆశిస్తారు. కానీ అలాంటివి ట్రైలర్ లో లేవు.
తమన్ అందించిన బిజియం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. డార్క్ థీమ్ లో మంచి విజువల్స్ రాబట్టారు. అడవిలో జరుగుతున్న స్మగ్లింగ్ ని అరికట్టి, బానిసత్వంతో నలిగిపోతున్న ప్రజలని కాపాడే వీరుడి కథగా డాకు మహారాజ్ తెరకెక్కింది అని చెప్పొచ్చు. మొత్తంగా ట్రైలర్ అంచనాలు పెంచేలా ఉంది.