మేమిద్దరం దాదాపు ఒక్కటే..మెడలో జనసేన కండువాతో పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ క్రేజీ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా భగవంత్ కేసరి చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. దీనితో బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది.

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా భగవంత్ కేసరి చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. దీనితో బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
మరోవైపు బాలయ్య పాలిటిక్స్ తో కూడా బిజీగా ఉన్నారు. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలయ్య హిందూపురం పర్యటన రసవత్తరంగా మారింది. జనసేన, టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపురం వెళ్లారు.
ఈ సమావేశంలో బాలయ్య పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీగా మారాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకి నాకు చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరం ముక్కు సూటిగా మాట్లాడతాం. ఎవ్వరికి భయపడం. అలాగే అవినీతి అరాచకాలకు పాల్పడే వాళ్ళని లెక్కచేయకపోవడం ఇలా తనకి, పవన్ కళ్యాణ్ కి పోలికలు ఉన్నాయని బాలయ్య అన్నారు.
బాలయ్య మాట్లాడుతూ మెడలో జనసేన కండువా వేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన, తెలుగు దేశం పార్టీ పొత్తులో పోటీ చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పవన్ కళ్యాణ్, బాలయ్య లని ఫ్యాన్స్ ఒకే వేదికపై చూసే అవకాశం ఉంది.