గెలిస్తే ...అక్కడ ప్రభాస్ మాత్రమే కాదు..బాలయ్య కూడా కింగే
ప్రభాస్ సినిమాలు తప్పించి మన సినిమాలు ఏమీ బాలీవుడ్ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. భారీగానే రిలీజ్ చేస్తున్నా అక్కడ మినిమం రెస్పాన్స్ రావటం లేదు.

భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమా గా చెప్పబడుతున్న ఈ సినిమా లో శ్రీలీల ప్రధాన పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్వరలో హిందీలో కూడా విడుదలకానుంది. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో పేర్కోన్నాడు. అంతేకాదు హిందీలో స్వయంగా బాలయ్య డబ్బింగ్ కూడా చెప్పారు.ఇది ఆయనే ఈ స్టేజిపై ప్రకటించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీపై ఓ ప్రకటన రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ భాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వర్కవుట్ కానుందనే అంచనాలు ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలయ్యాయి.
ఈ మధ్యన ప్రభాస్ సినిమాలు తప్పించి మన సినిమాలు ఏమీ బాలీవుడ్ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. భారీగానే రిలీజ్ చేస్తున్నా అక్కడ మినిమం రెస్పాన్స్ రావటం లేదు. నాని దసరా సినిమా, రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాలు హిందీ వెర్షన్ పై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నాయి కానీ.అనుకున్న స్దాయిలో స్పందన లేదు. దాంతో బాలయ్య సినిమా అదీ ఆయన సొంత వాయిస్ తో చెప్పే వెర్షన్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. వర్కవుట్ అయితే మాత్రం బాలయ్య మాత్రం అమాంతంగా రెట్టింపు అవుతుందనటంలో సందేహం లేదు. అర్జున్ రాంపాల్ ఉండటం,ఒరిజనల్ లోనే హిందీ డైలాగులు ఎక్కువ ఉండటం బాలీవుడ్ భాక్సాఫీస్ కు కలిసొచ్చే అంశం.
ఇక ఈ సినిమాలో తన కూతురిని ఆర్మీకి పంపాలి అనే ఆశయం కలిగిన తండ్రిగా బాలకృష్ణ, ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేని కూతురిగా శ్రీలీల కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు నడుస్తుంది. అసలు విలన్ కి బాలకృష్ణ, శ్రీలీలకి సంబందం ఏంటి అనే సస్పెన్స్ మెయిన్టైన్ చేస్తూ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ ఫుల్ రెండో గెటప్స్ లో కనిపించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. కాజల్ హీరోయిన్. అర్జున్ రాంపాల్, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు.