చప్పుడు చెయ్యాక్ పిల్ల మొగ్గ.. భగవంత్ కేసరి ట్రైలర్ అబ్సల్యూట్లీ కెసీపిడి, బాలయ్య నెవర్ బిఫోర్ యాటిట్యూడ్

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే. అందులోనూ వీరసింహారెడ్డి హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

Nandamuri Balakrishna bhagavanth kesari trailer out now dtr

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే. అందులోనూ వీరసింహారెడ్డి హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. 

నేడు వరంగల్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి. అనిల్ రావిపూడి బాలయ్యని తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తున్నారు. నెలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 

కాజల్ అగర్వాల్ బాలయ్యకి జోడిగా నటిస్తుండగా.. శ్రీలీల బాలయ్య కుమార్తె గా నటిస్తోంది. బాలయ్య శ్రీలీలని ఆర్మీ అధికారిని చేయడం కోసం ట్రైన్ చేస్తూ కనిపిస్తాడు. శ్రీలీల మాత్రం తనకి ఆర్మీ ఇష్టం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నాకు ఇదంతా ఇష్టం ఉండదు.. నన్ను వదిలేయ్ అన్నట్లుగా శ్రీలీల వేడుకుంటుంది. బిడ్డని ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి అంటూ బాలయ్య చెబుతాడు. 

ఇంతలో బాలయ్యకి విలన్లతో ఫైట్ మొదలవుతుంది. బాలయ్య తెలంగాణ యాసలో మిమ్మల్ని పంపిన కొడుకు ఎవ్వరో తెలియాలి అంటూ తనదైన శైలిలో పవర్ ఫుల్ గ అంటాడు. అర్జున్ రామ్ పాల్ ప్రధాన విలన్ గా అవిటి వాడిగా కనిపిస్తున్నాడు. 

 

దేవుడు ఎవడ్రా దేవుడు ఎవడు.. బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే వంద దేవుళ్ళ లెక్క అంటూ చెబుతున్న డైలాగ్ అదిరిపోయింది. చప్పుడు చెయ్యాక్ పిల్ల మొగ్గ లాంటి పంచ్ డైలాగులు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios