స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నానా పటేకర్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి నానా పటేకర్ ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించేశాడు.

అతడికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు కూడా తగ్గిపోయారనే చెప్పాలి.  నటి తనుశ్రీదత్తా.. నానాపటేకర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటి కారణంగా నానాకి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల ఓ హిందీ సినిమా నుండి ఆయన్ని తొలగించి ఆ పాత్రలో రానాని తీసుకున్నారు.

అటువంటి నటుడిని ఇప్పుడు టాలీవుడ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ నానాని తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. 

ఒకవేళ నానాని తీసుకున్న తరువాత వివాదాలు చెలరేగితే.. అనవసరమైన గొడవలు జరుగుతాయని ఆలోచిస్తున్నారు. సో.. ఇంకా ఈ విషయంపై ఫైనల్ డెసిషన్ కి రాలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అది పూర్తయిన తరువాత సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.