Asianet News TeluguAsianet News Telugu

#మీటూ ఎఫెక్ట్: నానాపటేకర్ పాత్రలో రానా..?

'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్ లతో కూడిన కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఓ పక్క సినిమాలతో మరోపక్క టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాడు. 

Nana Patekar gets replaced by Rana Daggubat
Author
Hyderabad, First Published Oct 22, 2018, 1:50 PM IST

'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్ లతో కూడిన కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఓ పక్క సినిమాలతో మరోపక్క టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాడు.

ఈ క్రమంలో ఆయనకి బాలీవుడ్ సినిమా 'హౌస్ ఫుల్ 4'లో నటించే చాన్స్ వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో నానా పటేకర్ పోషించాల్సిన పాత్రని రానాతో చేయించబోతున్నారని అంటున్నారు. మీటూ ఆరోపణల కారణంగా నటుడు నానాపటేకర్, దర్శకుడు సాజిద్ ఖాన్ ఈ సినిమా నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

దీంతో దర్శకుడిగా హౌస్ ఫుల్ 3 సినిమాను డైరెక్ట్ చేసిన ఫర్హాద్ సంజి రంగంలోకి దిగారు. ఇక నానా పటేకర్ పాత్రని రానా పోషించబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి చిత్రబృందం నుండి ఎలాంటి అధికార ప్రకటన లేదు.

సాజిద్ నడియాద్వాల నిర్మిస్తోన్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, బొమన్ఇరాని, చుంకీ పాండే, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతి ఖర్భంద, కృతి సనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios