టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నటి నమ్రత మరోసారి తనది పెద్ద మనసని నిరూపించుకుంది. మహేష్ బాబు, నమ్రత ఇప్పటికే ఎన్నోఅనాధ శరణాలయాలకు ఆర్ధిక సహాయం చేశారు. తాజాగా మరోసారి నమ్రత అనాధ పిల్లల కోసం స్పెషల్ షోని ఏర్పాటి చేసింది.

'ఏఎంబీ' సినిమాస్ మల్టీప్లెక్స్ లో అనాధ పిల్లల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసి హాలీవుడ్ సినిమా 'స్పైడర్ మ్యాన్-ఇన్ టు ది స్పైడర్ వర్స్' అనే సినిమాను చూపించారు. దాదాపు 150 మంది పిల్లలు 3డీలో ఈ సినిమాను చూసి సంతోషపడ్డారు. నమ్రత కొంత సమయం పిల్లలతో గడిపారు.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు బయటకి వచ్చాయి. సోనీ పిక్చర్స్ ఇండియా కూడా ఈ షో ఏర్పాటు చేయడంతో భాగస్వామ్యం వహించిందని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ ప్రమోషన్స్ కోసం నమ్రత చాలానే చేస్తోంది.

వీలైనంతగా ఈ థియేటర్స్ ని ప్రమోట్ చేస్తోంది. డిసంబర్ 2న సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా గచ్చిబౌలిలో ఈ మల్టీప్లెక్స్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే!