గత కొద్దిరోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోన్న నటి సోనాలి బింద్రేకి మాటిచ్చానని అంటోంది మహేష్ బాబు భార్య నమ్రత. 'మహర్షి' సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాకు వెళ్లిన మహేష్ బాబు సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో కలిసి విహారయాత్రకి వెళ్తున్నాడు. సోనాలి న్యూయార్ లో చికిత్స పొందుతున్నారు.

ఆమెని నమ్రత ప్రత్యేకంగా కలిశారు. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా వెల్లడించింది. 'సోనాలి స్ట్రాంగ్ విమెన్.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఆమె చాలా ఫిట్ గా ఉన్నారు. త్వరలో మామూలు జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెతో కాసేపు సరదాగా గడిపాను.

చాలా విషయాలను మాట్లాడుకున్నాం. తన అనారోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను నాకు చెప్పారు. తాను బలంగా ఉండటానికి ఏం చేస్తున్నారో కూడా వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఎల్లప్పుడూ దేవుడ్ని ప్రార్దిస్తున్తానని సోనాలికి చెప్పాను. నేను సోనాలిని, ఆమె కుటుంబాన్ని మరోసారి కలవాలనుకున్నాను.

సోనాలి నేను కలిసి సెంట్రల్పార్క్ లో వాకింగ్ చేయాలనుకున్నాం. కానీ వేరే పని ఉండడంతో మరో చోటుకి వెళ్లాల్సివచ్చింది. త్వరలోనే సోనాలిని మళ్లీ కలుస్తాను. సెంట్రల్ పార్క్ లో వాకింగ్ కి వస్తానని తనకి మాటిచ్చాను'' అంటూ వెల్లడించింది.