సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి తరువాత ఎంతగా మారాడో తెలిసిందే. నమ్రత తన జీవితంలోకి వచ్చిన తరువాత మహేష్ లో చాలా మార్పులు వచ్చాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి తరువాత ఎంతగా మారాడో తెలిసిందే. నమ్రత తన జీవితంలోకి వచ్చిన తరువాత మహేష్ లో చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకు మీడియాకి, తన సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉండే మహేష్ నమ్రత వచ్చిన తరువాత మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, సినిమాలను ప్రమోట్ చేయడం వంటివి చేస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి కారణం కూడా నమ్రత అనే చెప్పాలి. ఇటీవల ఈ జంట ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా.. నమ్రతని ఒక నటుడిగా మహేష్ కి ఎన్ని మార్కులు వేస్తారని అడిగితే.. పదికి పది అని చెప్పింది. 

అదే ప్రశ్న మహేష్ ని అడిగితే 6 నుండి 7 మార్కులు అని చెప్పాడు. ఒక భర్తగా మహేష్ కి ఎన్ని మార్కులు వేస్తారని నమ్రతని ప్రశ్నిస్తే అప్పుడు కూడా పదికి పదని సమాధానమిచ్చింది.

మహేష్ అప్పుడు కూడా తనకు 6 నుండి 7 మార్కులే వేసుకున్నాడు. ఒక తండ్రిగా మహేష్ కి పదికి 20 మార్కులు, వ్యక్తిగా పదికి వంద మార్కులు వేసింది. ఈ మార్కుల విషయంలో తాను అబద్ధం చెప్పడం లేదని వెల్లడించింది.