మహేష్‌ మరదలు, నమ్రత సిస్టర్‌ శిల్పా శిరోద్కర్‌ బర్త్ డే విషెస్‌ చెప్పారు. ఆమె మహేష్‌ని ఫ్యామిలీ మ్యాన్‌తో పోల్చడం ఆకట్టుకుంటుంది.

సోమవారం మొత్తం సూపర్‌ స్టార్‌ మహేష్‌ మేనియా సాగింది. సోషల్‌ మీడియా మొత్తం ఆయన నామస్మరణం జరిగింది. టాలీవుడ్‌లోనూ సెలబ్రిటీల విషెస్‌తో మారమ్రోగింది. మరోవైపు ట్విట్టర్‌ స్పేస్‌ అంటూ ఆయనపై సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించడం, ఆయనతో అనుబంధాన్ని చాటుకున్నారు. అభిమానులు ఆయన బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో మహేష్‌ మరదలు, నమ్రత సిస్టర్‌ శిల్పా శిరోద్కర్‌ బర్త్ డే విషెస్‌ చెప్పారు. ఆమె మహేష్‌ని ఫ్యామిలీ మ్యాన్‌తో పోల్చడం ఆకట్టుకుంటుంది. ఆమె చెబుతూ, `నేను ఆయన సక్సెస్‌ని, ప్రేమ, సంతోషాన్ని కోరుకుంటున్నా. అందుకు ఆయన నిజమైన అర్హుడు` అని తెలిపింది. అయితే ఓ కన్వర్జేషన్‌లో మహేష్‌ గురించి ఏం చెబుతారంటే.. `మహేష్‌ గురించి నేను ఏం చెప్పగలను. అందరికీ ఆయన సూపర్‌ స్టార్‌. కానీ మాకు ఆయనో కుటుంబం. నాకు తెలిసిన అత్యంత వినయపూర్వకమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. వృతి పట్ల మహేష్‌ అంకితభావం అద్భుతమైనది` అని తెలిపారు. ఇంకా చెబుతూ `తన కుటుంబం అంటే మహేష్‌కి ప్రపంపం. ఆయన పూర్తిగా అంకితమైన భర్త, తండ్రి` అని తెలిపింది. 

View post on Instagram

ఇదిలా ఉంటే తనకు బర్త్ డే తెలిపిన వారందరికి మహేష్‌ ధన్యవాదాలు తెలిపారు. తన బర్త్ డేని ఇంతగా సెలబ్రేట్‌ చేసినందుకు, తనని ఇంతగా కనెక్ట్ అయ్యేలా చేసిన వారందరికి థ్యాంక్స్ చెప్పారు. అభిమానుల ప్రేమని సెలబ్రేట్‌ చేసుకున్నట్టు తెలిపారు. అదే సమయంలో ప్రతి రోజు ఎంతో కృతజ్ఞుడినై ఉంటానని, కాకపోతే ఈ రోజు అది మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. `సర్కారు వారి పాట` టీజర్‌కి వస్తోన్న రెస్పాన్స్ పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు కూడా తన సినిమాలతో మరింతగా ఎంటర్‌టైన్‌ చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు మహేష్‌. 

Scroll to load tweet…