మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు? అప్డేట్ ఇచ్చిన తల్లి నమ్రతా శిరోద్కర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని హీరోగా ఎప్పుడు లాంచ్ కాబోతున్నారంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తల్లి నమ్రతా అప్డేట్ ఇచ్చారు. ఏమన్నారంటే..
 

Namrata Shirodkar Interesting Update on Gautam Ghattamaneni Entry to Films NSK

సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఏకైక పుత్రుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni)  స్టార్ కిడ్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక అటు వారి కూతురు  సితారా సైతం అందరికీ సుపరిచితమే. రీసెంట్ గా సితారా అంతర్జాతీయ బ్రాండ్ పీఎంజే జ్యూవెల్లరీకి అంబాసిడర్ గా మారి సెన్సేషన్ గా మారారు. ఈరోజు ఇండియాలో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సితారాతోపాటు Namrata Shirodkar కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు రాబోతున్నారనే ప్రశ్న ఎదురైంది. నమ్రతా మాట్లాడుతూ.. గౌతమ్ ప్రస్తుతం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారు. ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే గౌతమ్ తన స్టడీస్ పైనే ఫోకస్ పెట్టాడు. మున్ముందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాతే ప్లాన్ చేసే అవకాశం ఉంది.’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడప్పుడే గౌతమ్ తెరపై కనిపించే ఛాన్స్ లేదని తేలిపోయింది.

ఇక గౌతమ్ అటు స్టడీస్ తోపాటు స్విమ్మింగ్ లోనూ నైపుణ్యం సాధించారు. ఇప్పటికే చాలా టైటిల్స్ గెలుచుకున్నారు. మరోవైపు థియేటర్ ఆర్ట్స్ పైనా శిక్షణ తీసుకుంటున్నారు. ఆ మధ్యలో ఓ ఇంగ్లీష్ నాటకంలో నటించారు. గుక్కతిప్పకుండా డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్నారు. అప్పట్లో దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక సితార కూడా యాక్టింగ్, డాన్స్ లో శిక్షణ పొందారు. 

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘1: నేనొక్కడే‘లో చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ నటించిన విషయం తెలిసిందే. అదే తొలిచిత్రం. అయినా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక నమ్రతా తమ పిల్లల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు. వారి భవిష్యత్ ను బ్యూటీఫుల్ గా ఉండేలా ఆయా అంశాలను దగ్గరుండి నేర్పిస్తున్నారంట. ఇక తాజాగా నమ్రతా ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. గౌతమ్ ఎంట్రీ మరో మూడునాలుగేళ్ల తర్వాతేనని తెలుస్తోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios