సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త కథలను ఎంచుకోవడంలో చాలా క్లియర్ గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే అబద్దపు కథనాలు అభిమానులను చిరాకును కలిగిస్తాయి. ఎక్కువ శాతం మహేష్ తన కథలను భార్య నమ్రతతో డిస్కస్ చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారని టాక్ వస్తుంటుంది.    

ఒక సినిమా ద్వారా నష్టపోకూడదని ఎక్కువగా ఆలోచించేవారిలో మహేష్ ఒకరు. అందుకే ప్రిన్స్ సెలెక్ట్ చేసుకునే కథల విషయంలో నలుగురిని అడిగి గాని ఒక నిర్ణయం తీసుకోడని  ఆయన సతీమణి నమ్రత పాత్ర కూడా ఉంటుందని మరో పాజిటివ్ టాక్ కూడా ఉంది. ఇక ఫైనల్ గా ఆ విషయంపై నమ్రత రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

మహేష్ ప్రాజెక్టులను తాను నిర్ణయించనని నమ్రత స్పష్టం చేశారు.  మహేష్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తనతో ఎక్కువగా డిస్కస్ చేయరని చెబుతూ పూర్తిగా మా శ్రీవారి నిర్ణయమే ఫైనల్ అని తెలియజేశారు. ఇక ప్రస్తుతం నమ్రత 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు.  మేజర్ అనే టైటిల్ సెట్ చేసిన ఆ మూవీలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు.