త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నమిత తనతో కలిసి నటించిన వీర్ ను పెళ్లి చేసుకోనున్న బొద్దుగుమ్మ నవంబర్ 24న తిరుమలలో పెళ్లి చేసుకోనున్న నమిత మగాళ్లపై నమ్మకం కోల్పోయిన సమయంలో వీర్ సర్ ప్రైజ్ ఇచ్చాడట

నమిత వివాహంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఆలస్యం చేస్తే మరింత డ్యామేజ్ చేసేస్తారని భావించి... తను పెళ్లి చేసుకోబోయే వాడిని పరిచయం చేయడమే కాకుండా ఏకంగా పెళ్లి డేట్‌, వేదికని ప్ర‌క‌టించి అంద‌రికీ షాకిచ్చింది. ఈ నెల 24న తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు అఫీషియల్‌గా కన్ఫమ్ చేసింది.

తాను వీర్ నుంచి ఇలాంటి సర్ ప్రైజ్ ను తాను ఊహించలేదన్న నమిత.. తమ స్నేహం కొంత కాలంగా సాగుతోందని, తమ అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే కావడంతో.. వీర్ ప్రపోజల్ కు ఓకే చెప్పేసానని నమిత తెలిపింది. గత మూడు నెలలుగా వీర్ ను మరింత అర్థం చేసుకున్నానని,. వాస్తవానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్ ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది.

"వీర్ చాలా శాంత స్వభావి. మా ఇద్దరి అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి. 2016 సెప్టెంబర్‌లో నా బెస్ట్ ఫ్రెండ్ అయిన శశిధర్ బాబు నాకు వీర్‌ని పరిచయం చేశారు. అప్పటి నుండి మా మధ్య చిన్న చిన్నగా మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం అని తెలిపింది.

“సెప్టెంబర్6, 2017న నాకోసం బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అంతే పడిపోయా. అప్పటి నుండి మా మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. మా ప్రేమను పెద్దవాళ్లు కూడా ఆశీర్వదించారు. మేమిద్దరం నవంబర్ 24న తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ జర్నీలో నాకు సహకరించి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను'' అంది నమిత.