నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రం. దీనినే అధికారికంగా ఖాయం చేస్తారా లేక వేరే టైటిల్ నిర్ణయిస్తారా అనేది వేచి చూడాలి. జైసింహా విజయం తర్వాత కేఎస్ రవికుమార్ రెండవసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. 

హాట్ బ్యూటీస్ సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా ఎంపికయ్యారు. తాజాగా ఈ చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో లేడి విలన్ గా నమిత నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నమిత పాత్ర సినిమా మొత్తం నెగిటివ్ షేడ్స్ తో కొనసాగుతుందట. పెళ్లి తర్వాత తెలుగు చిత్రాలకు కొంత గ్యాప్ ఇచ్చిన నమిత ఈ చిత్రానికి అంగీకరించిందా లేదా అనేది చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది. 

సింహా చిత్రంలో బాలయ్యతో కలసి నమిత కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది. నమిత ఈ రూలర్ చిత్రంలో నటించేది నిజమైతే ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.