'నర్తనశాల' సినిమాతో ఫ్లాప్ అందుకున్న నాగశౌర్య కొంతకాలం గ్యాప్ ఇచ్చి సమంత నటించిన 'ఓ బేబీ' సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది.

అయితే హీరోగా శౌర్య మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు నాగశౌర్య. తన సొంత బ్యానర్ లో 'అశ్వద్దామ' సినిమాను పూర్తి చేస్తూనే.. అవసరాల శ్రీనివాస్, పీపుల్స్ మీడియాతో మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు 'సుబ్రహ్మణ్యపురం' డైరెక్టర్ సంతోష్ తో 'పార్ధు' అనే మరో సినిమా ఓకే చేశాడు.

ఈ సినిమాను ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. విలువిద్య నేపధ్యంలో సాగే కథ అని సమాచారం. ఈ మూడు సినిమాలతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ లో సౌజన్య అనే లేడీ డైరెక్టర్ తో సినిమా చేయడానికి అంగీకరించినట్లు లేటెస్ట్ గా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోల్లో ఎవరి చేతిలో కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ లేవు. ఒకేసారి శౌర్య ఇన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేయడం విశేషం. ఈ లెక్కన చూస్తుంటే వచ్చే ఏడాది 2020లోపు శౌర్య నుండి వరుసగా సినిమాలు రావడం ఖాయమనిపిస్తుంది.