నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఓటిటి స్ట్రీమింగ్ డేట్.. అఫీషియల్
థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భిన్న మతాలకు చెందిన ఓ జంట ప్రేమ కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కృష్ణ వ్రింద విహారి సినిమా తెరకెక్కింది.
మొదటి నుంచీ నాగశౌర్య కు రొమాంటిక్ కామెడీ కథ లు నప్పుతున్నాయి. ఆ సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. దాంతో మరోసారి తనకి అచ్చొచ్చిన కథనే ఎంచుకుని సొంత నిర్మాణ సంస్థలో ‘కృష్ణ వ్రింద విహారి’ చేశారు. ఈ సినిమా కోసం ఆయన పాదయాత్ర కూడా చేశారు. థియేటర్ లో ఫన్ బాగానే పండిందనిపించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
అక్టోబర్ 23 నుంచి అంటే ఈ రోజు రాత్రి 12 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చాలా కాలం నుండి సరైన హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు నాగశౌర్య. లక్ష్య లాంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్న ఆయన సరైన కొట్టాలని ఉద్దేశంతో కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మునుపెన్నడు నటించని ఒక బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో నటిస్తూ ఉండడంతో పాటు ఈ సినిమా కోసం మునుపెన్నడు చేయని పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్ తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో జనం పెద్దగా థియేటర్స్ లో ఈ సినిమాని చూడలేదు. ఇప్పుడు వారంతా ఓటిటిలో చూస్తారని భావిస్తున్నారు.
చిత్రం కథేంటంటే: కృష్ణాచారి (నాగశౌర్య) సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు. ఇంట్లో కట్టుబాట్లు ఎక్కువ. కృష్ణాచారి తల్లి అమృతవల్లి (రాధికా శరత్‌కుమార్) అంటే ఆ ఊళ్లో తెలియనివాళ్లు ఉండరు. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసమని హైదరాబాద్ చేరుకుంటాడు కృష్ణాచారి. ఐటీ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్‌గా చేరతాడు. అక్కడే మేనేజర్‌గా పనిచేసే వ్రిందా (షిర్లే సేథియా)ని చూడగానే ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆమెతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటాడు. కానీ, వ్రిందా ఓ సమస్యతో బాధపడుతుంటుంది. అందుకే పెళ్లికి నిరాకరిస్తుంది. ఆ సమస్యని దాచిపెట్టి పెళ్లికి పెద్దల్ని ఒప్పించేందుకు కృష్ణ ఎన్ని అబద్ధాలు ఆడాడు? పెళ్లి తర్వాత ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడన్నది మిగతా