నాగ్ కు ఆశపుట్టింది, నెట్ ఫ్లిక్స్ ఊరుకుంటుందా?
నాగార్జున హీరోగా అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. కౌంటర్ టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో థియోటర్స్ లో రిలీజ్ చేసే పరిస్దితి కనపడటం లేదు. దాంతో ఓటీటిలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేసారు.అందుకు తగినట్లుగా నెట్ ఫ్లిక్స్ తో డీల్ చేసుకున్నారు.అయితే ఇప్పుడు భాక్సాపీస్ వద్ద వంద శాతం ఆక్యుపెన్సీసీతో సినిమాలు డబ్బు బాగా తెచ్చిపెడుతున్నాయి.

బాగోలేదుకున్న 30 రోజుల్లో ప్రేమించటం ఎలా, జాంబీరెడ్డి వంటి సినిమాలు సైతం భారీగానే రెవిన్యూను పొందాయి. ఈ నేపధ్యంలో ఓటీటిలో రిలీజ్ ని ప్రక్కన పెట్టి థియోటర్ రిలీజ్ చేసేద్దామనే నిర్ణయానికి నాగార్జున వచ్చారట. అందుకోసం ఏప్రియల్ 2న రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసారని మీడియా వర్గాల సమాచారం. అయితే ఏప్రిల్ 2నే సీటిమార్, సుల్తాన్ లు ఆల్రెడీ షెడ్యూల్ అయ్యున్నాయి. దాంతో రిలీజ్ డేట్ మారుస్తారేమో అనే ఆలోచన కూడా ఉంది. అయితే ఈ విషయమై నాగ్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఏమీ రాలేదు.
ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున సైతం ఓటీటికు ఈ సినిమా కు ఓకే చేయటం పెద్ద సర్ఫైజ్ గా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగుతారు విజయ్ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్’ చిత్రం చూడాల్సిందే.
‘‘వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్ ఓ భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో నాగ్ ‘వైల్డ్‌డాగ్’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్, కాలెబ్ మాథ్యూస్, రుద్రా గౌడ్, హష్వంత్ మనోహర్ కనిపించనున్నారు. సయామీ ఖేర్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది’’అని చిత్ర టీమ్ తెలిపింది.