బిగ్‌బాస్‌కి, స్టార్‌మాకి నాగార్జున వార్నింగ్‌ ఇచ్చాడట. అది మామూలు వార్నింగ్‌ కాదు.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌ అని తెలుస్తుంది. ఇలానే చేస్తే తాను హోస్ట్ గా చేయలేనని చెప్పాడట. మరి ఇందుకు కారణం ఏంటనేది చూస్తే.. లీకులే నాగార్జున వార్నింగ్‌కి కారణమని తెలుస్తుంది. బిగ్‌బాస్‌4 ప్రారంభం నుంచి షోకి సంబంధించిన లీకులు అవుతూనే ఉన్నాయి.  ఎపిసోడ్‌కి ముందే ఆ రోజు ఏం జరుగుతుందనేది లీక్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌ డిటెయిల్స్ అన్నీ ముందే తెలిసిపోతున్నాయి. కెప్టెన్‌ ఎవరు, టాస్క్ లేమిటీ? నామినేషన్స్ ఎవరు.. ఇలా ప్రతిది ముందే తెలిసిపోతుంది. దీంతో షోపై కిక్‌ పోతుంది. అంతేకాదు ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే విసయం కూడా ముందే సోషల్‌ మీడియాలో వార్తలుగా వస్తున్నాయి. ఇక షో చూడటం దేనికనే కామెంట్స్ వినిపిస్తున్నాయట. ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్ళింది. ఇదే కాదు ఈ సీజన్‌ ప్రారంభం నుంచీ ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. దీంతో నాగార్జున బాగా సీరియస్‌ అయినట్టు సమాచారం. 

పైగా ప్రోమోల పేరుతో ఎపిసోడ్‌ కిక్‌ మొత్తాన్ని పోగొడుతున్నారు. ప్రోమోల్లో ఉన్నంత ఎపిసోడ్‌లో ఉండటం లేదని అంటున్నారు. రోజుకి మూడు నాలుగు ప్రోమోలు విడుదల చేస్తూ అసలు విషయాన్ని మొత్తం రివీల్‌ చేస్తున్నారు. దీంతో ఇది కూడా ఒకింత షోపై కిక్‌ పోగొడుతుందని అంటున్నారు. దీంతో నాగ్‌ బాగానే సీరియస్‌ అయ్యారట. బిగ్‌బాస్‌ టీమ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్‌. ఇదే కొనసాగితే ఇక హోస్టింగ్‌గా చేయనని తేల్చిచెప్పేసినట్టు టాక్‌. మరి దీన్ని బిగ్‌బాస్‌ టీమ్‌ ఎలా మ్యానేజ్‌ చేస్తుందో చూడాలి.