వాస్తవానికి 'మన్మథుడు2' చిత్రం తర్వాత నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్‌లో నటించాల్సి ఉంది. కాకపోతే మన్మధుడు 2 డిజాస్టర్ అవటంతో నాగ్ లో కంగారు తెచ్చింది. ఎంత కామెడీ అయినా స్క్రిప్టు బాగోలేకపోతే నిలబడదని అర్దం చేసుకున్నారు. దాంతో 'బంగార్రాజు' పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమా స్క్రిప్టుని మరింత టైట్ గా చేయమని దర్శకుడుకి సూచించారు. దానికి తోడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తర్వాత చేసిన సినిమా అనుకున్న స్దాయిలో ఆడకపోవటం కూడా నాగ్ ని ఆలోచనలో పడేసి. ప్రక్కన పెట్టారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు బంగార్రాజు సినిమా చేద్దామని నాగ్ ఫిక్స్ అయ్యి...డైరక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పని మొదలెట్టమన్నారట. ఇలా ఇన్నాళ్లూ ఆగిన సినిమా సినిమా ..ఊహించని విధంగా పట్టాలెక్కిస్తూండటంతో స్క్రిప్టు పూర్తిగా సెట్ అయ్యిందనా లేక నాగ్ మైండ్ సెట్ లో మార్పు వచ్చిందా అనే చర్చలు మొదలయ్యాయి. 

అయితే ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ స్క్రిప్టు ఓకే చేయటం వెనక నాగ్ ఓ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట. 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్‌ కాబట్టి ఖచ్చితంగా క్రేజ్ వస్తుంది. ఇప్పుడు చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమా చాలా సీరియస్ సినిమా. ఆ మూడ్ నుంచి బయిటపడాలి అంటే ఫన్ ఎంటర్టైనర్ చేయాలి. అందుకు బంగార్రాజు అవకాసం ఇస్తుంది. అందులోనూ ఈ వెర్షన్ లో రొమాన్స్ డోస్ పెంచారట. రమ్యకృష్ణ క్యారక్టర్ సైతం అదిరిపోయేలా ఉంటుందిట. కథ...ముప్పై ఏళ్ల క్రితం జరిగే పీరియడ్ సినిమా. 90ల్లో విలేజ్ లో సెట్ చేసారట. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచుతాయని ..నాగ్ ఓకే చెప్పాడంటున్నారు. అలాగే తన తండ్రి నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ చిత్రం దశరాబుల్లోడు ఛాయిలు కూడా ఇందులో కనపడి..హిట్ కు మార్గంగా అనిపించిందిట. 
 
ఈ క్రమంలో గత కొంతకాలంగా దీని స్క్రిప్ట్ పనితో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.  డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగును ప్రారంభిస్తారని, దాదాపు సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగును పూర్తి చేస్తారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో నటించిన ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో కూడా కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం.