ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చుక్కలు కనిపించాయి. ఎమోషనల్ గా ఫిజికల్ బాగా కంటెస్టెంట్స్ పోరాడాల్సివచ్చింది. నామినేషన్స్ తో పాటు, టికెట్ టు ఫినాలే టాస్క్ లు అనేక ఇబ్బందులకు గురిచేశాయి. కాగా టికెట్ టు ఫినాలే టాస్క్ లో విజేతగా నిలచిన సభ్యుడు నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ నిర్వహించే మూడు టాస్క్ లలో గెలిచిన సభ్యుడు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటాడని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి టాస్క్ లో ఇంటి ఆవరణలో ఉన్న ఆవు బొమ్మనుండి పాలు సేకరించాలని, అధిక పాలు సేకరించిన నలుగురు సభ్యులు రెండవ దశకు వెళతారని చెప్పాడు. 

ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు పోటీపడడంతో పాటు తోపులాటకు దిగారు. ఈ క్రమంలో మోనాల్ అవినాష్ ని కాలితో తన్నింది. మోనాల్ కాలితో తన్నడంతో అవినాష్ సీరియస్ అయ్యాడు. మొదట అవినాష్ ని నేను తన్నలేదని అబద్ధమాడిన మోనాల్, తరువాత ఒప్పుకుంది. అలాగే అవినాష్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే ప్రయత్నం చేసింది. దానికి అవినాష్ అంగీకరించ లేదు. 

కాగా నేడు ఈ పంచాయతీ నాగార్జున వద్దకు చేరింది. నిజంగా ఏమి జరిగిందని తెలుసుకునే ప్రయత్నం నాగార్జున చేశారు. ఐతే మోనాల్ ఎప్పటిలాగే కన్నీళ్లతో తన తప్పు కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసింది. కన్ఫెషన్ రూమ్ లో అవినాష్ మాత్రం నాగార్జునకు పూస గుచ్చినట్లు చెప్పాడు. అసలు నిజం తెలియాలంటే వీడియో ప్లే చేయాల్సిందే అని నాగార్జున అనడం జరిగింది. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ఈ అంశాలతో ఆసక్తిరేపుతుండగా, నాగార్జున ఈ పంచాయితీలో ఏమి తీర్పు ఇస్తాడో చూడాలి.