అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేశారు. చాలా మంది హీరోల వారసులతో పోల్చుకుంటే అఖిల్ చూడడానికి అందంగా ఉండడంతో పాటు డాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేయగలడు. కానీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. 

ఇప్పటివరకు హీరోగా అతడు చేసిన మూడు సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు సినిమాకి హీరోయిన్ ఫైనల్ కాలేదు. పనులు కూడా అనుకున్నట్లు జరగడం లేదు.

ఇప్పటికే సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తికావాల్సివుంది. కానీ ఏది అనుకున్నట్లు జరగడం లేదు. దీంతో నాగార్జునకి టెన్షన్ మొదలైంది. ఇటీవల అతడు నటించిన 'మన్మథుడు 2' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అదొక బాధలో ఉంటే మరోపక్క చిన్న కొడుకుని హీరోగా సెటిల్ చేయలేకపోతున్నాననేది మరో బాధ.

ఈ ఆలోచనలతో నాగార్జున బెంగ పెట్టుకున్నాడని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అఖిల్ మాత్రం బొమ్మరిల్లు బాస్కర్ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. కనీసం ఈసారైనా అఖిల్ కి అదృష్టం కలిసొచ్చి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!