కింగ్ నాగార్జున నుంచి ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం నాగ్ మన్మథుడు 2లో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. 

ఈ చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య కలసి నటించబోతున్నారు. నాగార్జున సరసన నటించే హీరోయిన్ విషయంలో పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో నాగార్జున క్రేజీ బ్యూటీ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేని నటింపజేసేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. 

పూజా హెగ్డే అంగీకరిస్తే తన కొడుకు సరసన నటించిన మరో హీరోయిన్ తో నాగ్ రొమాన్స్ చేసినట్లు అవుతుంది. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో రకుల్, నాగ చైతన్య జంటగా నటించారు. ప్రస్తుతం రకుల్ మన్మథుడు 2లో నటిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా లో నటించిన లావణ్య త్రిపాఠి.. నాగ చైతన్య సరసన యుద్ధం శరణం చిత్రంలో నటించింది. 

పూజా హెగ్డే, నాగ చైతన్య కలసి ఒక లైలా కోసం చిత్రంలో నటించారు. ఇదిలా ఉండగా బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య సరసన కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.