సూపర్ స్టార్ సినిమాలో నాగ్..?

First Published 7, May 2018, 3:06 PM IST
nagarjuna to act with mohan lal
Highlights

 ఇప్పుడు మరోసారి ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడట నాగ్

అక్కినేని నాగార్జున గతేడాది 'రాజు గారి గది2' చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన 'ఆఫీసర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా హీరో నానితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాతో పాటు నాగ్ లిస్టులో మరికొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ హీరోకి మలయాళ సినిమాలోనటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రియదర్శన్'మరాక్కర్' అనే సినిమాను తెరకెక్కించనున్నాడు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. మరి ఈసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం నాగార్జునను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. నాగ్ కు, ప్రియదర్శన్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో నాగార్జున హీరోగా ఈ దర్శకుడు 'నిర్ణయం' అనే సినిమాను రూపొందించాడు. నాగ్ తనయుడు అఖిల్ నటించిన 'హలో' సినిమాలో హీరోయిన్ గా ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి నటించింది. ఇప్పుడు మరోసారి ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడట నాగ్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

loader