‘ఆఫీసర్’ ట్విట్టర్ రివ్యూ

nagarjuna starer officer movie twitter review
Highlights

ట్విట్టర్ రివ్యూ 

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ.. వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘శివ,  గోవిందా..గోవిందా, అంతం ’ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఆఫీసర్’ చిత్రాన్ని రూపొందించారు వర్మ. ఈ మూవీలో నాగార్జున సరసన ముంబై మోడల్ మైరా సరీన్ జోడీ కట్టింది. తెలుగులో ఆమెకు తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 

ఇప్పటికే ఓవర్సీస్‌లో ‘ఆఫీసర్’ మూవీ ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ‘క్రేజీ కాంబో ఈజ్ బ్యాక్’ అంటూ నెటిజన్లు ‘ఆఫీసర్’ చిత్రానికి‌ మిక్స్డ్ టాక్ వస్తోంది. కొందరు బ్లాక్ బస్టర్ అంటుంటే.. గునపం దింపేశాడు వర్మ. హిట్ కాకపోతే తన్నండి అన్నాడు కదా? ఎక్కడ తన్నాలి ఆర్జీవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ శాతం మందికి ఈ సినిమా నచ్చలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నాగార్జున ఒక్కడే సినిమాని నడిపించాడని కొందరు ట్వీట్ చేస్తున్నారు. ఇక  కొందరైతే.. రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఈ లెక్కన సినిమా తేడా కొట్టినట్టే అని అనిపిస్తోంది. పూర్తి రివ్యూ కోసం మరికొద్ది సేపు ఆగాల్సిందే. 

loader