సక్సెస్ అందుకున్నట్టే అందుకొని యువ హీరో నాగ చైతన్య మళ్ళీ డీలా పడుతున్నాడు. గత ఏడాది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత నాగ చైతన్య మరో హిట్ అందుకోలేదు. వరుసగా యుద్ధం శరణం - శైలజా రెడ్డి అల్లుడు అలాగే ఇటీవల వచ్చిన సవ్యసాచి ప్లాప్ లిస్ట్ లో చేరిపోయాయి. 

ఇక డీలా పడ్డ కొడుకు కెరీర్ ను మళ్ళీ ట్రాక్ లో పెట్టేందుకు మరోసారి నడుం బిగించాడు నాగార్జున. ముందుగానే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ వద్ద కథను రెడీ చేసి ఉంచిన నాగ్ ఇప్పుడు ఆ కథను తెరకెక్కించడానికి దర్శకుడ్ని వెతుకుతున్నాడు. యువ దర్శకులతో ఎవరితో రిస్క్ చేయించవద్దని సక్సెస్ ఫుల్ దర్శకులను కొంచెం సీనియారిటీ ఉన్న దర్శకుల కోసం నాగ్ వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన భార్య సమంతతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఆ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. అలాగే బాబీ దర్శకత్వంలో మేనమామ వెంకీతో వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.