'ఆఫీసర్' వాయిదా తప్పదా..?

nagarjuna's officer movie postponed
Highlights

వైవిధ్యమైన సినిమాలు ఎన్నుకుంటూ ఇప్పటికీ హీరోగా వరుస విజయాలను అందుకుంటున్నాడు 

వైవిధ్యమైన సినిమాలు ఎన్నుకుంటూ ఇప్పటికీ హీరోగా వరుస విజయాలను అందుకుంటున్నాడు హీరో నాగార్జున. 'శివ'తో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మళ్ళీ ఇంతకాలానికి సినిమా చేస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. 'ఆఫీసర్' అనే పేరుతో తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 25న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

ఇప్పటివరకు సినిమా బిజినెస్ జరగలేదట. ఏరియాల వారీ సినిమాను అమ్మడానికి చూస్తున్నారు. దీంతో ఓ వారం రోజులు ఆలస్యంగా సినిమాను విడుదల కానుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నాడు. వర్మ గనుక మీడియా ముందుకు వస్తే అతడిని శ్రీరెడ్డి, అల్లు అరవింద్ వంటి వారి గురించి ప్రస్తావించడం ఖాయం.

ఈ విధంగా తన సినిమాకు పబ్లిసిటీ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. మరోపక్క నాగార్జున ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు లేరు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఆఫీసర్ గురించి ప్రస్తావించడం మానేశారు. మరి వర్మ ఒక్కడే ఈ సినిమాను ఎంతవరకు తీసుకువెళ్తాడో చూడాలి! 

loader