కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2002లో విడుదలైన నాగార్జున సూపర్ హిట్ చిత్రం మన్మథుడుకి ఇది సీక్వెల్. దీనితో మన్మథుడు 2పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత నాగార్జున రొమాంటిక్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. 

తాజాగా అక్కినేని అభిమానులు ఖుషి అయ్యే అప్డేట్ వచ్చింది. మన్మథుడు 2 చిత్ర టీజర్ ని ఈ నెల 13న మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. పేకాటలోని కింగ్ కార్డుపై నాగార్జున యానిమేషన్ లుక్ ని డిజైన్ చేశారు. కార్డు పైభాగంలో నాగార్జున కాఫీ తాగుతున్నట్లు ఉండగా, తలక్రిందులుగా వైన్ తాగుతున్నట్లు నాగ్ లుక్ ఆకట్టుకుంటోంది. 

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ టీజర్ గురించి తెలియజేస్తూ 'ది కింగ్ ఈజ్ నౌ ది కింగ్ ఆఫ్ హార్ట్స్' అనే క్యాప్షన్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమంత కూడా ఈ చిత్రంలో చిన్న కామియో రోల్ పోషిస్తోంది.