నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం రాజుగారిగది 2 మెంటలిస్టుగా కనిపించనున్న రాజుగారి గది 2 మీసం తీయడానికి గల కారణాన్ని తెలియజేసిన నాగార్జున
హీరోయిజాన్ని పక్కనపెట్టి మరీ ప్రయోగాలకు తెరలేపుతూ విభిన్న కథలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు అక్కినేని నాగార్జున. టాలీవుడ్ లో మన్మధుడిగా పేరొందిన ఆయన నటించిన తాజా చిత్రం ‘ రాజుగారి గది2’. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్టుగా కనపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంలను పెంచేస్తోంది. ట్రైలర్ లో నాగార్జున చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. అయితే.. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో నాగ్.. మీసం లేకుండా కనిపించారు.. దీంతో కొత్త సినిమా కోసమే నాగ్ మీసం తీశారంటూ వార్తలు వెలువడ్డాయి.
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ప్రతిష్టాతక్మ చిత్రం ‘మహాభారత’లో కర్ణుడు పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారని, స్క్రీన్ టెస్ట్ కోసమే నాగార్జున మీసాలు తీసేశారని వార్త బాగా ప్రచారంలో ఉంది. ఇప్పటికే నాగార్జున స్క్రీన్ టెస్టులో పాల్గొన్నారని కూడా రూమర్. అయితే ఈ గాలి వార్తలన్నింటినీ నాగార్జున ఒక్క మాటతో తుడిచేశారు.
‘అసలు దీనికి ఎలాంటి కారణం లేదు. వచ్చే మూడు నెలల్లో నాకు ఎలాంటి షూటింగ్‌లు లేవు. అందుకే కొత్తగా ఏమైనా చేద్దామని ప్రయత్నించాను. మీసాలు తీసేసి కొత్త లుక్‌తో కనిపించాను. ఈ కొత్త లుక్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కినేని కుటుంబం అంతా.. సమంత, నాగ చైతన్యల వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 6,7 తేదీల్లో గోవాలో వీరి వివాహం జరగనుంది.
ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న రాజుగారి గది2 సినిమాలో సమంత, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు.
