అక్కినేని నాగచైతన్య- సమంత విడిపోవడం బాధాకరమన్నారు చైతూ తండ్రి, కింగ్ నాగార్జున. భార్యాభర్తల మధ్య జరిగినవి.. వ్యక్తిగతం, అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. సామ్-చైతూ ఇద్దరూ నాకిష్టమేనని నాగార్జున చెప్పారు. సమంత మా ఫ్యామిలీతో వున్న రోజులన్నీ అద్బుత తీపి గుర్తులని నాగ్ అన్నారు.
అక్కినేని నాగచైతన్య- సమంత విడిపోవడం బాధాకరమన్నారు చైతూ తండ్రి, కింగ్ నాగార్జున. భార్యాభర్తల మధ్య జరిగినవి.. వ్యక్తిగతం, అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. సామ్-చైతూ ఇద్దరూ నాకిష్టమేనని నాగార్జున చెప్పారు. సమంత మా ఫ్యామిలీతో వున్న రోజులన్నీ అద్బుత తీపి గుర్తులని నాగ్ అన్నారు. సామ్ -చైతూ ఆయురారోగ్యాలతో ఉండాలని నాగ్ ఆకాంక్షించారు. ఇద్దరికి దేవుడి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నానని నాగార్జున ప్రార్ధించారు.
కాగా, టాలీవుడ్ క్రేజీ కపుల్ నాగచైతన్య(naga chaitanya), సమంత(samantha) విడాకులు(divorce) తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు దీనిపై మౌనంగా ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ప్రకటించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా శనివారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ALso Read:సమంత-నాగచైతన్య డైవర్స్ః విడాకులకు బీజం పడింది అక్కడేనా?.. బయటకొస్తున్న షాకింగ్ విషయాలు ?
`ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాది పదేళ్ల స్నేహబంధం. ఈ డిఫికల్ట్ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్ద`ని నాగచైతన్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్ పోస్ట్ అభిమానులతో షేర్ చేశారు. మున్ముందు కూడా తమకి సపోర్ట్ చేయాలని కోరారు. చైతూ ట్విట్టర్ ద్వారా, సమంత ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు తమకి సపోర్ట్ ని కొనసాగించాలని అభిమానులను, శ్రేయోభిలాషులను,మీడియాని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సమంత, నాగచైతన్య మొదట `ఏం మాయ చేసావె` చిత్రంతో పరిచయమయ్యారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల జర్నీ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. 2017 అక్టోబర్ 6న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి పది కోట్లకుపైగా ఖర్చు అయినట్టు సమాచారం. టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా ఉన్న వీరిద్దరు ఇప్పుడు విడిపోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు షాక్‌కి గురవుతున్నారు.
