MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత-నాగచైతన్య డైవర్స్ః విడాకులకు బీజం పడింది అక్కడేనా?.. బయటకొస్తున్న షాకింగ్‌ విషయాలు ?

సమంత-నాగచైతన్య డైవర్స్ః విడాకులకు బీజం పడింది అక్కడేనా?.. బయటకొస్తున్న షాకింగ్‌ విషయాలు ?

సమంత, నాగచైతన్య డైవర్స్ ఇప్పుడు టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. అక్కినేని అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. మరి ఈ రొమాంటిక్‌ కపుల్‌ విడాకులకు తీసుకోవడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర, షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. 

2 Min read
Aithagoni Raju
Published : Oct 02 2021, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదర్శ జంటగా ఉంది సమంత- చైతన్యల జంట. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుక టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. గోవాలో వీరి మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. అటు క్రిస్టియన్(సమంత)‌, ఇటు హిందూ(చైతూ) సాంప్రదాయాల ప్రకారం వీరి మ్యారేజ్‌ జరిగింది. పెళ్లి సమయంలో ఎంతో ఎంజాయ్‌ చేశారు చైతూ, సమంత. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే కలిగే ఆనందం, పొందే అనుభూతి పెళ్లిలో వీరిద్దరిలో స్పష్టంగా కనిపించింది. 

27

అలాంటి మోస్ట్ లవబుల్‌ కపుల్‌ డైవర్స్ ప్రకటించడం సినీ ప్రముఖులకు ఓ రకంగా దిగ్ర్భాంతికి గురి చేసిందని చెప్పాలి. వీరి డైవర్స్ అనౌన్స్ మెంట్‌ని చూసి అంతా షాక్‌లోకి వెళ్లిపోయారు. అయితే తాము విడిపోవడానికి  కారణాలను ప్రకటించలేదు చైతూ, సామ్‌. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం పలు కారణాలు వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలకు బీజం పడింది అక్కడే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

37

వాటిలో మొదటిది సమంత బోల్డ్ రోల్‌ చేయడం. సమంత పెళ్లి తర్వాత మరింత బోల్డ్ రోల్స్ చేసేందుకు సిద్ధమవుతుంది. తమిళంలో నటించిన `సూపర్‌ డీలక్స్` సినిమా ఓ కారణం. ఇందులో అత్యంత బోల్డ్ రోల్‌ చేసింది సమంత. ఆ సమయంలోనే ఆమె అభిమానులు కొత్త అసంతృప్తిని వ్యక్తం చేశారట. దీనికి తోడు ఆమె ఫస్ట్ టైమ్‌ వెబ్‌ సిరీస్‌` ది ఫ్యామిలీ మ్యాన్ 2` చేసింది. 
 

47

`ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌లో అత్యంత ఇంటిమేట్‌ సీన్లు చేసింది సమంత. బస్సులో కొందరు ఆమెపై చేతులు వేసి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించే సీన్‌ షాక్‌కి గురి చేస్తే, తను పని చేసే కంపెనీలో మేనేజర్‌ లైంగిక వేధింపులు, చివరికి అతనికి సపోర్ట్ చేసే సీన్‌ మరింత షాకిచ్చేలా ఉంది. ఇలాంటి సీన్‌ చేసేందుకు సమంత ఎలా ఒప్పుకుందనే చర్చ సర్వత్రా జరిగింది. అభిమానులు సైతం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అక్కినేని ఫ్యామిలీ చాలా కోపానికి గురైందని సమాచారం. 
 

57
It is said that Samantha plays a terrorist in the web series The Family Man 2. The show also features Priyamani, Sharib Hashmi, Shreya Dhanwanthary, Sharad Kelkar, Darshan Kumaar, Dalip Tahil, Shahab Ali and of course Manoj as the lead.

It is said that Samantha plays a terrorist in the web series The Family Man 2. The show also features Priyamani, Sharib Hashmi, Shreya Dhanwanthary, Sharad Kelkar, Darshan Kumaar, Dalip Tahil, Shahab Ali and of course Manoj as the lead.

అలాగే ఢిల్లీలో జరిగిన ఓ పార్టీలో సమంత కనిపించిన తీరుపట్ల అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఇబ్బంది పడిందని, సమంత విషయంలో అక్కినేని కుటుంబం చాలా అసంతృప్తిగా ఉందనే ప్రచారం జరిగింది. వీటివల్లే చైతూకి, సమంతకి మధ్య మనస్పర్థాలు తలెత్తాయని అంటున్నారు. మరోవైపు వరుస ఫోటో షూట్లలోనూ సమంత నెవర్‌ బిఫోర్‌ అనేంతగా అందాలు ఆరబోసింది. ఇది కూడా ఇటు అక్కినేని ఫ్యామిలీకి, వారి అభిమానులకు మింగుడు పడకుండా మారిందని అంటున్నారు. 

67

ఈ కారణాలు సమంత, చైతూల మధ్య వార్‌కి ఊతమిచ్చాయని టాక్. దీనికితోడు నాగార్జునతో పెళ్లి తర్వాత అమల హీరోయిన్‌గా సినిమాలు మానేసింది. పిల్లలు, కుటుంబానికి పరిమితమైంది. కేవలం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, చాలా సెలక్టీవ్‌గానే సినిమాలు చేసింది. అలా సమంత కూడా ఇంటికే పరిమితం కావాలని ఫ్యామిలీ నుంచి ఒత్తిడి పెరిగిందట. ఈ విషయంలో సమంత నో చెప్పిందని టాక్‌. పెళ్లి తర్వాత సమంత సినిమాల విషయంలో జోరు పెంచింది. దీంతో సినిమాలు, అద్భుతమైన సక్సెస్‌ని, కెరీర్‌ని వదులుకుని ఇంటికి పరిమితం కావడం సమంతకి నచ్చలేదని, అందుకే ఈ విషయంలో చైతూతో ఫైట్‌ చేసిందని సమాచారం. 

77

ఈ ఫైటింగ్‌లో భాగంగా చైతూ, సమంత మధ్య సుధీర్ఘ చర్చలు, వాదనలు జరిగాయని, చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతా, ఇవి కాకుండా మరేదైనా కారణాలున్నాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ . దీనిపై వీరిద్దరు స్పందిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. మరోవైపు తమ మధ్య విభేదాలకు ఇతరులు కుట్రలు చేశారని ఇన్‌స్టా స్టోరీస్‌లో సమంత పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved