సినీ తారలందరూ ఒకే చోట కనిపిస్తే అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా బడా స్టార్స్ ఈ మధ్య కార్తికేయ పెళ్లిలో కనిపించారు. పెళ్లి వేడుక ముందు రోజు నుంచి ఎండింగ్ వరకు ఎదో ఒక ఈవెంట్ తో తారలు డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లిలో ప్రతీక్ చోట కనిపిస్తున్నాడు. 

తారక్ కూడా అదే తరహాలో వేడుకలో హడావుడి చేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. రీసెంట్ గా నాగార్జున కూడా వారితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివ సినిమాలోని బాటనీ పాఠముంది.. అనే సాంగ్ కి అందరి కలిసి ఒకే తరహాలో డ్యాన్స్ చేయడం నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. వారితో పాటు అఖిల్ కూడా ఉన్నాడు. 

అఖిల్ - కార్తికేయ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇక బాహుబలి సెకండ్ యూనిట్ డైరెక్షన్ దింపార్ట్మెంట్ కి హెడ్  గా ఉన్న కార్తికేయ ఇప్పుడు నిర్మాతగా అడుగులు వేస్తున్నాడు.