సినిమాల రిలీజ్ విషయంలో నాగార్జున కొత్త ఐడియా ఏసీ లేని థియేటర్లో అన్నపూర్ణ సినిమాలు ఆడవు రారండోయ్ వేడుక చూద్దాం 400 థియేటర్లలో.. నైజాం సొంతంగా రిలీజ్ చేస్తున్న నాగ్

సినిమాను భారీగా ప్రమోట్ చేసి జనాల్లో క్రేజ్ పెంచి సాధ్యమైనన్ని థియేటర్లలో రిలీజ్ చేసి వారంరోజుల్లో వీలైనంతగా క్యాష్ చేసుకోవడం కొన్ని పెద్ద సినిమాలుగా చెప్తున్న చిత్రాలకు ఆనవాయతీగా మారింది. ఇలాంటి టైమ్ లో నిర్మాతగా నాగార్జున కొత్త పంథాలో వెళ్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై.. నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను కేవలం 400 థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అధిక సంఖ్యలో థియేటర్లను వాడుకుంటే... ఫుల్ రన్ లో వాటిని పోషించడమే తప్ప.. షేర్ తగ్గిపోవడం తప్పదని నాగార్జున ఆలోచన. సినిమాలు ఎక్కువ థియేటర్లలో వేయడం వల్ల షేర్ తగ్గిపోవడమే తప్ప, వేరు ఉపయోగం లేదని ఇటీవల కొన్ని సినిమాలు నిరూపించాయి. అందుకే తెలివిగా ముందు జాగ్రత్త పడినట్లు అర్థమవుతోంది.

ఇటీవల అభిషేక్ పిక్చర్స్ బేనర్ పై తెరకెక్కిన కేశవ సినిమాను 700 వరకు థియేటర్లలో వేసారు. అర్బన్ ఏరియాలో వచ్చిన షేర్ కాస్తా చిన్న సెంటర్ల డెఫిసిట్ తో నష్టపోవాల్సి వస్తోంది. దీంతో గ్రాస్ కనిపిస్తుంది కానీ, లాభం అంతగా ఉండదు. అందుకే నాగార్జున కేవలం 400 థియేటర్లను మాత్రమే ఎంచుకున్నాడు. ఆ థియేటర్లు కూడా ఏసీ హాల్ ఉండేలా చూసుకున్నారట. అయితే పైరసీ కాపీ రాకముందే సినిమా డబ్బులు చేసుకోవాలి. సినిమా బాగుందని టాక్ వస్తే, జనం థియేటర్ కు రావడానికి వెనుకాడం లేదు అనే ధైర్యంతో నాగ్ ముందుకు వెళ్తున్నట్లున్నారు. మరి లాభాలు ఏ మేరకు వస్తాయో చూడాలి.