Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ నిర్మాత ఛానెళ్లకి చుక్కలు చూపిస్తున్నాడట!

ఈ మధ్యకాలంలో సినిమా థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్, రీమేక్ రైట్స్ కి క్రేజ్ పెరిగింది. స్టార్ హీరో సినిమాకు శాటిలైట్, డిజిటల్ హక్కుల బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. 

nagarjuna nani devadas movie satellite rights details
Author
Hyderabad, First Published Sep 5, 2018, 12:45 PM IST

ఈ మధ్యకాలంలో సినిమా థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్, రీమేక్ రైట్స్ కి క్రేజ్ పెరిగింది. స్టార్ హీరో సినిమాకు శాటిలైట్, డిజిటల్ హక్కుల బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. క్రేజీ ప్రాజెక్ట్ అయితే చాలు నిర్మాతలు భారీ ధరలు చెప్పి సినిమాను అమ్ముకుంటున్నారు. తాజాగా ఓ సినిమా విషయంలో నిర్మాత ఛానెళ్లకి చుక్కలుచూపిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, నాని కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవదాస్'.

ప్రస్తుతం ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అతి తక్కువ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేస్తున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో యంగ్ హీరో సినిమాకే పది కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాతలు ఈ మల్టీస్టారర్ సినిమాను మొత్తం రూ.10 కోట్లలో పూర్తి చేయనున్నారట. అదేంటి నాని, నాగ్ ల రెమ్యునరేషనే పది కోట్లు ఉంటుంది కదా అనుకుంటున్నారా..? నిజానికి నాని 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా సమయంలో చేసుకున్న ఒప్పందమిది.

అప్పటికి ఇప్పటికి నాని రెమ్యునరేషన్ పెరిగినప్పటికీ అశ్వనీదత్ కుటుంబంతో ఉన్న బంధం కారణంగా నాని అతి తక్కువ పారితోషికానికి ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకి కూడా రూ.3 కోట్లకి మించి రెమ్యునరేషన్ ఇవ్వలేదని టాక్. అటు ఇటుగా మొత్తం సినిమాను రూ.10 కోట్లలో పూర్తి చేస్తున్నారట. అలాంటిది ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో నిర్మాత రూ.15 కోట్లు చెబుతున్నాడట.

డీల్ సెట్ అయితే మాత్రం శాటిలైట్ తోనే సినిమా టేబుల్ ప్రాఫిట్ లో ఉంటుంది. కానీ రూ.15 కోట్లలంటేనే చానెళ్లు నోరెళ్లబెడుతున్నాయని సమాచారం. కానీ ఈ ఇద్దరు హీరోలకు బుల్లితెరపై క్రేజ్ ఉండడంతో ఆ మాత్రం బిజినెస్ జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరి రైట్స్ ఏ ఛానెల్ దక్కించుకుంటుందో చూడాలి! 

Follow Us:
Download App:
  • android
  • ios