Asianet News TeluguAsianet News Telugu

నాగార్జునకి బిగ్ షాక్..కబ్జా ఆరోపణలతో 'ఎన్ కన్వెన్షన్'ని కూల్చివేసిన ప్రభుత్వం.. 

తాజాగా నాగార్జున సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. మాదాపూర్ లో ఉన్న నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ప్రభుత్వం తాజాగా కూల్చి వేసింది. 

Nagarjuna n convention demolished by govt officials dtr
Author
First Published Aug 24, 2024, 9:47 AM IST | Last Updated Aug 24, 2024, 9:47 AM IST

అక్కినేని నాగార్జున వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు వివాదాలు తప్పవు. తాజాగా నాగార్జున సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. మాదాపూర్ లో ఉన్న నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ప్రభుత్వం తాజాగా కూల్చి వేసింది. 

ఎన్ కన్వెన్షన్ పై చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. నాగార్జునకి సినిమాలతో పాటు ఇలాంటి వ్యాపారాలు చాలా ఉన్నాయి. మాదాపూర్ లోని తమ్మిడి కుంట చెరువుని నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారని కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. 

కాగా శనివారం తెల్లవారు జామున హైడ్రా అధికారుల బృందం.. ఆధారాలతో అక్కడికి వెళ్లి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అక్రమ కట్టడాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం సంచలనంగా మారింది. 

భారీ బందోబస్తు నడుమ కూల్చివేత పనులు సాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ పై ఆరోపణలు వచ్చాక హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తమ్మిడి కుంట చెరువులో 3 ఎకరాలు ఆక్రమించి కట్టారు అని తేల్చారు. ఇలా కబ్జా చేసి కట్టిన భవనాలన్నింటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. 

అందుకు అనుగుణంగానే నేడు నాగార్జునకి ఇలా బిగ్ షాక్ తగిలింది. హైడ్రా అధికారులు నగరంలోని 56 చెరువుల పరిస్థితిపై శాటిలైట్ చిత్రాల ఆధారంగా విచారణ చేపట్టారు. కూల్చివేత పనులు కొనసాగుతుండడంతో ఎన్ కన్వెన్షన్ కి వెళ్లే అన్ని దారులని అధికారులు మూసివేశారు. అయితే దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios