కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ మన్మథుడు 2. దాదాపు 17 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన మన్మథుడు చిత్రానికి ఇది సీక్వెల్. మన్మథుడు చిత్రంలో మహిళలంటే అసహ్యించుకునే మన్మథుడు ఈ చిత్రంలో మాత్రం వారిని ఇష్టపడేవాడిగా నాగ్ నటిస్తున్నాడు. కానీ ప్రేమ, పెళ్లి లాంటి విషయాలకు దూరం. 

తాజాగా మన్మథుడు 2 ట్రైలర్ రిలీజ్ అయింది. 'అద్భుతం.. అమోఘం.. ఇలాంటి పథకం మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా వేయలేదు' అంటూ నాగార్జున చెబుతున్న ఫన్నీ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నాగార్జున కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలనుకుంటుంటారు. కానీ నాగ్ మాత్రం తప్పించుకు తిరుగుతుంటాడు. మీరెప్పుడూ ప్రేమలో పడలేదా అని రకుల్ అడగగా నాగ్ చెప్పే డైలాగ్ చాలా సరదాగా ఉంటుంది. 'ఒక్క పూట భోజనం కోసం వ్యవసాయం చేయను' అని నాగార్జున అంటాడు. 

ట్రైలర్ చివర్లో 'మీ కృష్ణావతారం అయిపోయింది.. రామావతారం స్టార్ట్ అని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ కూడా బావుంది. మొత్తంగా మన్మథుడు 2 చిత్రం వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన మన్మథుడు 2 ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.