జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో సినీ సెలబ్రిటీలు కాస్త నెమ్మదిగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటింగ్‌ ప్రారంభమైన వెంటనే 7.30గంటలకు చిరంజీవి సతీసమేతంగా ఓట్‌ వేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, ఆయన సతీమణి ఫిల్మ్ నగర్ క్లబ్‌లో ఓట్‌ వేశారు. మరో నిర్మాత ఉషా ముల్పూరి సైతం తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. 

తాజాగా హీరో నాగార్జున తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. అలాగే దర్శకుడు తేజ సైతం తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. వీరితోపాటు నిర్మాత, నటి, హోస్ట్ మంచు లక్ష్మీ సైతం తమ ఓటింగ్‌ని వినియోగించుకున్నారు. ఆమె తొమ్మిదిన్నర గంటల సమయంలో ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ సెంటర్‌లో తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓట్‌ని వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. పోలింగ్‌ స్టార్ట్ అయిన మూడు గంటలైనా.. ఇంకా సెలబ్రిటీలు చురుకుగా  ఓటింగ్‌లో పాల్గొనకపోవడం విచారకరం.