నాగార్జున దృష్టిలో మహేష్ సినిమా హిట్ కాదా..?

nagarjuna intentionally forgot to mention bharat ane nenu movie at goodachari success meet
Highlights

నిన్న 'గూఢచారి' సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున.. ఈ ఏడాది విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలు 'రంగస్థలం','మహానటి' ఆ తరువాత 'గూఢచారి' అంటూ ఆయన మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

'బ్రహ్మోత్సవం','స్పైడర్' వంటి ఫ్లాప్ సినిమాల తరువాత మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ప్రేక్షకుల ముందుకు హిట్ టాక్ తెచ్చుకుంది. తమ అభిమాన హీరోకి సరైన హిట్ పడిందంటూ అభిమానులు పండగ చేసుకున్నారు. మహేష్ ఫ్యామిలీ కూడా ఈ సినిమా హిట్ కావడంతో ఎమోషనల్ అయింది. మహేష్ కెరీర్ కి ఈ సినిమా హిట్ అవ్వడమనేది చాలా అవసరం.

ఈ క్రమంలో ఆ సినిమా హిట్ అవ్వడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. మరి అలాంటి సినిమాను హీరో నాగార్జున హిట్ గా పరిగణించడం లేదా..? అంటే అవుననే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్న 'గూఢచారి' సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున.. ఈ ఏడాది విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలు 'రంగస్థలం','మహానటి' ఆ తరువాత 'గూఢచారి' అంటూ ఆయన మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

పైగా ఆయన 'నాకు తెలిసి కరెక్ట్ ఆడి, డబ్బు చేసుకున్న సినిమాలు ఈ మూడే' అంటూ నొక్కి నొక్కి చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. నాగార్జున పొరపాటున 'భరత్ అనే నేను' సినిమా సంగతి మర్చిపోలేదట. ఈ సినిమా కొన్ని ఏరియాల్లో నష్టాలను మిగిల్చిందని అలాంటప్పుడు దాన్ని హిట్ గా ఎలా పరిగణిస్తామని కొందరి దగ్గర కామెంట్స్ చేసినట్లు వినికిడి. 

loader