నాగార్జునకు ఊరట.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు బ్రేక్...

ఎన్ కన్వెన్షన్ సెండర్ కూల్చివేతపై కింగ్ నాగార్జునకు ఊరట లభించింది. ఈ కూల్చివేతలకు బ్రేక్ పడింది. ఈవిషయంలో నాగ్ ఓ ట్వీట్ కూడా వేశారు.. ఇంతకీ విషయం ఏంటంటే..? 

Nagarjuna Gains Relief as Court Halts Demolition of N Convention Center in Hyderabad JmS

టాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో హైడ్రా గుబులు పట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరిని వదలకుండా హైదరాబాద్ లో చెరువులు, నాళాలు ఆక్రమించి కట్టుకున్న పెద్ద పెద్ద కట్టడాలను కూడా కూల్చివేస్తుంది  తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం హైడ్రా రచ్చ నడుస్తున్న క్రమంలో... హైదరాబాద్ లోని హీరో నాగార్జునకు సబంధించని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చివేస్తుంది ప్రభుత్వంతో. గతంలో చెప్పిన విధంగా మాదాపూర్ లో చెరువును ఆక్రమించి ఇది కట్టినట్టు నిర్ధారించి కూల్చివేతలు మొదలు పెట్టారు కూడా. 

ఇక ఈ విషయంలో కింగ్ నాగర్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులు ఇవ్వకుండా.. కోర్డు పరిధిలో ఉండగానే తన ప్రాపర్టీని కూల్చివేస్తున్నారని ఆయన తెలంగాణ హైకోర్ట్ ను ఆశ్రయించారు. ఈ క్రమంలో నాగార్జునకు హైకోర్డు లో ఊరట లభించింది. ఈ కేసును విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని మధ్యతర ఉత్తర్వులు జారీచేశారు. కూల్చివేతలపై స్టే రావడంతో..అక్కినేని హీరో ఊపిరి పిల్చుకున్నారు. 

అయితే ఇప్పటికే చాలా వరకూ బిల్డింగ్స్ ను కూల్చివేశారు. హైడ్రా పేరుతో చిన్నా పెద్దా తేడా లేకుండా అక్రమాలను కూల్చే ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెలబ్రిటీల లిస్ట్ లో ముందుగా నాగార్జున పేరు రావడంతో ఆయన కు సబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చడంస్టార్ట్ చేశారు. అయితే ఈ విషయంలో స్పందించారు కింగ్ నాగార్జున. ఎక్స్ ద్వారా స్పందించిన ఆయన ఈ విషయంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ట్వీట్ లో ఆయన ఏమన్నారంటే..? 

స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం.. మేమేమి తప్పు చేయలేదు..  చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఏ కట్టడం చేపట్టలేదని చెప్పాలనే నాప్రయత్నం అన్నారు కింగ్. 

ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత  చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే నేనే కూల్చివేసేవాడిని 

కాని ఇప్పుడు జరుగుతున్న  పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను' అని అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ఆయన అన్నట్టే కోర్టుకు వెళ్లడం.. కోర్టు ఈ కూల్చివేతలపై స్టే విధించడం జరిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios