బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభమైంది. నాగార్జున నటించిన కింగ్ చిత్రంలోని టైటిల్ సాంగ్ తో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో ఉత్సాహభరితంగా బిగ్ బాస్ వేదికపైకి వచ్చేశాడు. వేదికపైకి రాగానే నాగార్జున గత సీజన్ హోస్ట్ లు ఎన్టీఆర్, నానిని అభినందించాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి సభ్యులంతా ప్రవేశించారు. వితిక, వరుణ్ సందేశ్ దంపతుల రాకతో కంటెస్టెంట్స్ మొత్తం హౌస్ లోకి ఎంటర్ అయిపోయినట్లు అయింది. 'కొత్త బంగారు లోకం' చిత్రంలో పాటకు డాన్స్ చేస్తూ వరుణ్ సందేశ్, అతడి సతీమణి వితిక షెరు వేదికపైకి చేరుకున్నారు. వీరిద్దరూ చేసిన రొమాంటిక్ డాన్స్ ఆకట్టుకుంది. వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ డేస్ చిత్రం తనకు చాలా ఇష్టం అని నాగార్జున తెలిపారు. వితిక షెరు నాగార్జునకు తమ ప్రేమ గురించి తెలిపింది. 

షోలో అందరూ ఎలిమినేట్ అయి మీరు ఇద్దరూ మిగిలితే ఏంటి పరిస్థితి అని నాగార్జున సరదాగా అడిగాడు. వితిక, వరుణ్ ఎవరికీ వారు తానే గెలవాలని కోరుకుంటామని తెలిపారు. వితికని ఎత్తుకుని వరుణ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.