ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై నాగార్జున ఫైర్‌.. చట్టవిరుద్ధమంటూ ప్రకటన.. సంచలన నిర్ణయం..

హీరో నాగార్జునకి చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ని శనివారం మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో నాగ్ దీనిపై స్పందించి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 
 

nagarjuna fire on N convention demolised by govt officials arj

తెలుగు టాప్‌ హీరోల్లో ఒకరైన నాగార్జున వివాదంలో ఇరుక్కుతున్నారు. ఆయనకు చెందిన మాదాపూర్‌లోని `ఎన్‌ కన్వెన్షన్‌` సెంటర్‌ అక్రమంగా నిర్మించారని చెప్పి మున్సిపల్‌ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చెరువుని ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారనే ఆరోపణలతో ఈ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. 

ఈ నేపథ్యంలో తాజాగా హీరో నాగార్జున స్పందించారు. తమ కన్వెన్షన్‌ కూల్చివేత చట్టవిరుద్ధమని, కోర్ట్ నుంచి స్టే ఆర్డర్ ఉన్నాక, కేసు కోర్ట్ లో ఉన్నాక ఇలా చట్ట విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ని కూల్చివేతకు పాల్పడటం అత్యంత బాధాకరమని వెల్లడించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా నాగార్జున ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుందనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నోట్‌ని పంచుకుంటున్నట్టు వెల్లడించారు. తమ ప్రతిష్టని కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కోరకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నామని తెలిపారు నాగార్జున. 

`ఆ భూమి(ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మాణం) పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్(చెరువు) కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.

తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను` అని వెల్లడించారు నాగార్జున. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. మరి ఏది నిజమనేది కోర్టు తేల్చనుందని చెప్పొచ్చు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios