అక్కినేని కుటుంబంలో హీరోలంతా కలిసి నటించిన చిత్రం 'మనం'
అక్కినేని కుటుంబంలో హీరోలంతా కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ సినిమా విడుదలయ్యి ఈరోజుకి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నాగార్జున.. తన తండ్రి అక్కినేని నాగేశ్వరావుని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
''నాన్న మనం అంతా కలిసి నటించిన మనం సినిమా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. జీవితాన్ని మరణాన్ని ఎలా ఎదుర్కోవాలో మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందం. మీ జ్ఞాపకాలతో నవ్వుతూనే ఉంటాం'' అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కించిన 'మనం' సినిమాను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేశారు. ఏఎన్నార్ చివరిసారిగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య. సమంతా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అఖిల్ గెస్ట్ అప్పియరన్స్ఇచ్చాడు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం హిట్ ఆల్బమ్ గా నిలిచింది.
