Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: విశ్వ హీరోని చేసి పింకీని విలన్‌గా మార్చేశారు.. కమెడీయన్‌ సన్నీ.. రివేంజ్‌ మామూలుగా లేదుగా

నాగార్జున శనివారం ఎంట్రీ ఇవ్వడంతోపాటు హౌజ్‌మేట్స్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. మరోవైపు రివేంజ్‌ డ్రామాని రిపీట్‌ చేసి షాకిచ్చాడు. ఇంకోవైపు హీరోలు, విలన్లను బయటకు తెప్పించాడు. ఫైనల్‌గా ముగ్గురిని సేవ్‌ చేసి మరో ఐదుగురుని టెన్షన్‌లో పెట్టాడు. 

nagarjuna creat something intrest in bigg boss telugu 5 house 63th episode highlights
Author
Hyderabad, First Published Nov 6, 2021, 11:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5.. 62వ రోజు (63వ ఎపిసోడ్)(Bigg Boss Telugu 5) శనివారం ఆద్యంతం రక్తికట్టించేలా సాగింది. నాగార్జున(Nagarjuna) శనివారం ఎంట్రీ ఇవ్వడంతోపాటు హౌజ్‌మేట్స్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. మరోవైపు రివేంజ్‌ డ్రామాని రిపీట్‌ చేసి షాకిచ్చాడు. ఇంకోవైపు హీరోలు, విలన్లను బయటకు తెప్పించాడు. ఫైనల్‌గా ముగ్గురిని సేవ్‌ చేసి మరో ఐదుగురుని టెన్షన్‌లో పెట్టాడు. మొత్తంగా శనివారం బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ని రక్తికట్టించాడు. 

శని, ఆదివారాల్లో Nagarjuna సందడి చేస్తుంటారు. ఈ రోజు కూడా ఆయన కుర్రాడిలా మారిపోయి వచ్చాడు. శుక్రవారం హౌజ్‌లో ఏం జరిగిందో చూశాడు. ఇందులో షణ్ముఖ్‌పై సిరి ఇంకా బెట్టు చేస్తూనే ఉంది. ఎంత బ్రతిమాలినా వినలేదు. బాగా తిప్పించుకుంది. మాట్లాడకుండా తన పట్టుని సాగించుకుంది. ఇంకోవైపు రాత్రి టైమ్‌లో ప్రియాంక కన్నీళ్లు పెట్టుకోగా, మానస్‌ ఓదార్చాడు. ఆమెకి ధైర్యాన్నిచ్చాడు. అయితే సిరి టార్చర్ ఆగకపోవడంతో మహిళల గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షణ్ముఖ్‌. అంతేకాదు తన ప్రియురాలు దీప్తిని గుర్తు చేసుకున్నాడు. ఆమె అలిగితే వేరే లెవల్‌లో ఉంటుందన్నాడు. ఆమెనే భరిస్తే ఇవన్నీ మామూలుగానే ఉంటాయన్నాడు. ఈ లెక్కన దీప్తి అలిగితే ఎంతటి టార్చర్‌గా ఉంటుందో చెప్పాడు. 

అనంతరం ఇంటి సభ్యులతో నాగార్జున ఇంటరాక్ట్ అయ్యాడు. మొదట కెప్టెన్‌ అయిన అనీ మాస్టర్ని లేపి.. గతంలో గివప్‌ అంటూ, గ్రూపులుగా ఆడుతున్నారని, తనని ఇంటరైపోయానని చెబుతూ తప్పించుకుంటున్న అనీ మాస్టర్‌ కసిగా ఆడితే, గివప్‌ కాకుండా ఆడితే ఏకంగా కెప్టెన్సీ వచ్చిందని, ఆమెలో ధైర్యాన్ని నూరి పోశాడు నాగార్జున. ఆమెని అభినందించారు. షణ్ముఖ్‌ గురించి చెబుతూ, అతని కెప్టెన్సీని అభినందించాడు. అందరిని సమానంగా చూస్తున్నావని, ఫ్రెండ్స్ అని కూడా లెక్కచేయకుండా గేమ్స్ , టాస్క్ లు ఆడుతున్నావని, తప్పు చేసిన అందరికి సమాన ఫనిష్‌మెంట్లు ఇచ్చావని అభినందించాడు. ఇందులోనే సిరితో జరిగిన విషయాన్ని కూడా క్లీయర్‌ చేశాడు. ఇద్దరి మధ్య గ్యాప్‌ని దూరం చేశాడు. దీంతో ఇద్దరు కౌగిలించుకున్నారు. ఇద్దరు కలిసి పాటలకు డాన్స్ కూడా చేశారు. 

జెస్సీ గురించి నాగ్‌ చెబుతూ, అనారోగ్యం కారణంగా గేమ్స్ లో పార్టిసిపేట్‌ చేయాల్సిన అవసరం లేకపోయినా టాస్క్ ల్లో పాల్గొన్నందుకు అభినందించాడు. రవి విషయానికి వచ్చేసరికి రీవేంజ్‌ స్టార్ట్ చేశాడు నాగార్జున. హీరోస్‌, విలన్స్‌ టాస్క్ లో తనని టార్చర్‌ చేసినందుకుగానూ ప్రతీకారం తీర్చుకునే అవకావం ఇచ్చాడు. దీంతో రవి.. షణ్ముఖ్‌కి అన్ని మిక్స్ చేసిన జ్యూస్‌ తాగించాడు. మరోవైపు అనీ మాస్టర్‌.. కాజల్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ప్రియాంక రవిపై ప్రతీకారం తీర్చుకోగా, శ్రీరామ్‌ సన్నీపై రివేంజ్‌ తీర్చుకున్నారు. విశ్వ ఆట తీరుని అభినందించిన నాగ్‌.. ప్రియాంక మానస్‌ల మధ్య నెలకొన్న వివాదాన్ని క్లీయర్ చేశాడు. టెంపర్‌ తగ్గించుకుని బాగా ఆడుతున్న సన్నీని అభినందించాడు నాగ్‌. 

ఇక తొమ్మిదో వారంలో నామినేషన్‌లో ఉన్న వారిలో ఒకరిని సేవ్‌ చేయాల్సి వచ్చింది. ఇందులో నామినేషన్లు చేసే సమయంలో వాడిన పోమ్‌ల ద్వారానే ఒకరిని సేవ్‌ చేయాల్సి వచ్చింది. ఇందులో రవి సేవ్‌ అయ్యాడు. అనంతరం హీరోలు, విలన్లు అనే టాస్క్ ఇచ్చాడు నాగ్‌. ఇందులో హౌజ్‌లో తమకి హీరో ఎవరు, విలన్‌ ఎవరో చెప్పాల్సి ఉంటుంది. మొదటగా సిరి స్టార్ట్ చేసింది. తనకు షణ్ముఖ్ హీరో అని చెప్పింది. ఎంత ఇబ్బంది పెట్టినా, అతనే నా హీరో అని చెప్పింది. హీరోకి స్టార్‌ సింబల్‌ని అంటించాల్సి ఉంటుంది. ప్రియాంక విలన్‌ అని రెడ్‌ స్టాంప్‌ వేసింది. ప్రియాంక చెబుతూ తనకు మానస్‌ హీరో అని, తనక అన్ని రకాలుగా సపోర్టింగ్‌గా ఉంటాడని, మంచి చెడులు చెబుతాడని తెలిపింది ప్రియాంక. విలన్‌గా సిరికి ఇచ్చింది.  

శ్రీరామ్‌ చెబుతూ, విశ్వ హీరో అని, తను మంచి ఫైటర్‌ అని తెలిపాడు. సిరి విలన్‌ అని, తనకు టఫ్‌ ఫైట్‌ ఇస్తుందని చెప్పాడు. కాజల్‌ చెబుతూ, అనీ మాస్టర్‌ విలన్‌ అని, మానస్‌ హీరో అని పేర్కొంది. సన్నీ చెబుతూ, జెస్సీ హీరో అని, ఇంకా హీరోగా ఎదగాలని తెలిపాడు. ప్రియాంక విలన్‌ అని చెప్పాడు. రవి చెబుతూ.. విశ్వ హీరో అని ఆయన టేక్‌ కేర్, రెస్పాన్సిబులిటీస్‌ని ఆయన అభినందించారు. షణ్ముఖ్‌ విలన్‌ అని తెలిపాడు. అతని మూడ్‌ అర్థం కాదని, అతనితో ఈజీగా మూవ్‌ కావడం లేదన్నారు. షణ్ముఖ్‌ చెబుతూ, రవి విలన్‌ అని, హీరో సిరికి ఇచ్చాడు షణ్ముఖ్‌. సిరి గేమ్‌ ఆడుతున్న విధానం నచ్చిందని, ఓ ఫైటర్‌లా ఆడుతుందన్నాడు. 

అనీ మాస్టర్ చెబుతూ, తనకు కాజల్‌ విలన్ అని, విశ్వ హీరో అని చెప్పింది. విశ్వ చెబుతూ, శ్రీరామ్‌ హీరో అని, ప్రియాంక విలన్‌ అన్నాడు. జెస్సీ చెబుతూ, సిరి హీరో అని, కాజల్‌ విలన్‌ అని ఇచ్చాడు. మానస్‌ చెబుతూ, పింకీకి హీరో ఇవ్వగా ఆ ఆనందం తట్టుకోలేకి పింకీ ఏడ్చేసింది. విలన్‌గా రవికి ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఫైనల్‌గా విశ్వ హౌజ్‌లో హీరోగా నిలవగా, ప్రియాంక విలన్‌గా నిలిచింది. మధ్యలో మరోకరిని సేవ్‌ చేశాడు నాగ్‌. కెప్టెన్సీ టాస్క్ లో ఆడిన బ్యాగ్‌ల్లో ఉన్న బాల్స్ తీయాల్సి ఉంటుంది. రెడ్‌ బాల్‌ వస్తే అన్‌సేవ్‌, గ్రీన్‌ బాల్‌ వస్తే సేవ్‌. ఇందులో సిరి సేవ్‌ అయ్యింది. ఇక చివరగా ఫ్లవర్స్ ని తీసే టాస్క్ లో వైట్‌ రోజ్‌ వచ్చిన సన్నీ సేవ్ అయ్యాడు. దీంతో ఇప్పుడు కాజల్‌, ప్రియాంక, శ్రీరామ్‌, విశ్వ, జెస్సీ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు సేవ్‌ అవుతారు, ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది సస్పెన్స్ గా మారింది. ఆదివారం ఎపిసోడ్‌లో దానిపై స్పష్టత రానుంది.

also read: దీప్తి సునైనా అలిగితే వేరే లెవల్‌ టార్చరే అట.. షణ్ముఖ్‌ బోల్డ్ కామెంట్‌.. చుక్కలు చూపించిన సిరి

Follow Us:
Download App:
  • android
  • ios