Asianet News TeluguAsianet News Telugu

నార్త్ జనాలు కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు: నాగార్జున

యూ ట్యూబ్ లలో మన తెలుగు సినిమాలకు వస్తున్న ఆదరణ కూడా మిగతా బాషల వారిని ఆశ్చర్యపరుస్తోంది. హిందీ చేనెల్స్ లో కూడా టాలీవుడ్ యాక్షన్ కథలు తెగ ఆడేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు మాస్ కథలను నార్త్ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందులో అక్కినేని నాగార్జున సినిమాలకు కూడా మంచి క్రేజ్ అందుతోంది. 

nagarjuna comments on north audience response
Author
Hyderabad, First Published Sep 24, 2018, 5:24 PM IST

బాహుబలి తరువాత చాలా వరకు తెలుగు సినిమాల రేంజ్ పెరిగిందనే చెప్పాలి. అంతే కాకుండా యూ ట్యూబ్ లలో మన తెలుగు సినిమాలకు వస్తున్న ఆదరణ కూడా మిగతా బాషల వారిని ఆశ్చర్యపరుస్తోంది. హిందీ చేనెల్స్ లో కూడా టాలీవుడ్ యాక్షన్ కథలు తెగ ఆడేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు మాస్ కథలను నార్త్ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందులో అక్కినేని నాగార్జున సినిమాలకు కూడా మంచి క్రేజ్ అందుతోంది. 

అయితే ఆ విధంగా క్రేజ్ రావడం వల్ల నాగార్జునకు కొంత ఇబ్బందులు తప్పడం లేదట. ఈ విషయాన్నీ దేవ దాస్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ వివరించాడు. ఇంతకుముందు నార్త్ కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్ళేవాడిని. హైదరాబాద్ దాటి వెళితే ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడెక్కిళ్లినా గుర్తుపట్టేస్తున్నారు. ఫ్రీగా తిరగలేని పరిస్థితి. ఆఫీసర్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ జనాలు పెద్ద ఎత్తున చూడటానికి వచ్చారని నాగ్ తెలిపాడు.

అదే విధంగా బాహుబలి సినిమాతో బాషల మధ్య హద్దులు తొలిగాయని చెబుతూ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా పరిధి పెరిగిందని అన్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఒకేసారి సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. తమిళ్ లో ధనుష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తన పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని, అదే విధంగా బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కొంచెం సేపే కనిపించినప్పటికీ ఆ పాత్ర చాలా కీలకమైనదని నాగ్ వివరణ ఇచ్చారు. 

        

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios